నిజ జీవితంలో భార్య.. ఆ సినిమాలో మాత్రం 'అదర్ వుమన్'!
on Sep 24, 2020
1999 ఫిబ్రవరి 24న కాజోల్, అజయ్ దేవ్‌గణ్ పెళ్లి జరిగినప్పుడు వాళ్లను "అన్లైక్లీ పెయిర్" అని మీడియా అభివర్ణించింది. ఆ ఇద్దరూ తొలిసారి 1995లో 'హల్చల్' మూవీ సెట్స్‌పై కలుసుకున్నారు. మీకో సంగతి తెలుసా? 'హల్చల్' మూవీలో హీరోయిన్గా కాజోల్ ఫస్ట్ చాయిస్ కాదు. ఆ క్యారెక్టర్‌కు మొదట ఎంపికైంది దివ్యభారతి. అయితే ఆమె ఆకస్మిక మరణంతో చివరి నిమిషంలో ఆ సినిమా హీరోయిన్గా ఎంటర్ అయ్యింది కాజోల్.
ఆ మూవీ తర్వాత అజయ్, కాజోల్ కలిసి కొన్ని సినిమాలు చేశారు. వాటిలో 'దిల్ క్యా కరే' లాంటి హిట్ సినిమా కూడా ఉంది. విశేషమేమంటే పెళ్లయ్యాక ఆ ఇద్దరూ కలిసి నటించిన తొలి సినిమా అది. ఆ మూవీని అజయ్ తల్లితండ్రులు వీరూ దేవ్‌గణ్, వీణా దేవ్‌గణ్ నిర్మించారు. ఈ సినిమాకి సంబంధించి ఇంకో విశేషం.. ఇందులో అజయ్ భార్యగా మహిమా చౌదరి నటిస్తే, అతని జీవితంలో "మరో స్త్రీ"గా కాజోల్ కనిపించడం!
పెళ్లయ్యాక భర్త అజయ్‌తో కలిసి నటించిన తొలి సినిమా 'దిల్ క్యా కరే' మూవీ పోస్టర్‌ను ఇప్పుడు తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా షేర్ చేసింది కాజోల్. అప్పుడు వెళ్లిన కశ్మీర్ ట్రిప్‌ను గుర్తు చేసుకుంటూ, "కశ్మీర్‌కు నేను మొదటిసారి, ఒకే ఒక్కసారి వెళ్లింది అప్పుడే. వాట్ ఎ బ్యూటిఫుల్ ప్లేస్. లవ్ స్టోరీకి పర్ఫెక్ట్ ప్లేస్. కాదంటారా? #21yearsofDilKyaKare." అంటూ పోస్ట్ చేసింది.
Also Read