కాజల్ ఇలా అయిపోయిందేమిటి ??
on Jul 6, 2016
వచ్చే ఏడాదితో క్రేజీ గర్ల్ కాజల్ ఇండస్ట్రీకి వచ్చి పదేళ్ళు పూర్తవుతుంది. ఈ పదేళ్ళ కాలంలో కాజల్ చాలా చూసేసింది. హీరోయిన్ గా సూపర్ స్టార్ డమ్ మాత్రమే కాదు.. బోలెడన్ని సమస్యలను కూడా చవిచూసింది. అయితే.. మునుపెన్నడూ లేని విధంగా కాజల్ డల్ లుక్ ఆమె అభిమానులను తీవ్రంగా బాధపెడుతోంది. ఇటీవల చికాగో వెళ్ళిన కాజల్ అక్కడ ఓ ఫంక్షన్ కు ముఖ్య అతిధిగా విచ్చేసింది. ఆ ఫోటోలు కొన్ని నెట్ లో పెట్టారు. సదరు ఫోటోల్లో కాజల్ ను చూసినవాళ్ళందరూ నోరెళ్ళబెడుతున్నారు. అందుకు కారణం ఆమె అందం కాదు ఆమె పర్సనాలిటీ. నిజంగానే "సైజ్ జీరో" కోసం ప్రయత్నిస్తుందో లేక వరుస పరాజయాల కారణంగా నీరసించిందో తెలియదుగానీ.. కృంగి కృశించిపోయినట్లుగా ఉంది కాజల్ కొత్త లుక్. "సర్దార్ గబ్బర్ సింగ్, బ్రహ్మోత్సవం"ల డిజాస్టర్ల అనంతరం కాజల్ చేతిలో తేజ తెరకెక్కించనున్న సినిమా తప్పితే మరో తెలుగు సినిమా ఆఫర్ లేదు. తమిళంలోనూ ప్రస్తుతం నటిస్తున్న జీవా సినిమా తప్పితే మరో సినిమా లేదు. సో, ఆ బెంగ వల్ల ఇలా బక్కచిక్కిపోయిందేమో అని కాజల్ వీరాభిమానులు తెగ బాధపడిపోతున్నారు!