కాజల్ మెహందీ ఫొటో... ఎన్ని లైకులో!
on Oct 29, 2020
కాజల్ అగర్వాల్ ఇంట పెళ్లి భాజాలు మోగాయి. కాజల్ పెళ్లి సందడి షురూ అయ్యింది. ఈ రోజు మెహందీ ఫంక్షన్ జరిగింది. చేతికి గోరింటాకు పెట్టుకున్న ఫొటోను కాజల్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. #kajgautkitched అని ఓ హ్యాష్ ట్యాగ్ యాడ్ చేశారు. సాధారణంగా పెళ్లి సందర్భంలో 'hitched' అని హ్యాష్ ట్యాగ్ పోస్ట్ చేశారు. గౌతమ్ ఇంటి పేరు కిచ్లు కావడంతో 'kitched' అని కాజల్ ట్విస్ట్ ఇచ్చినట్టు ఉన్నారు.
కాజల్ సోషల్ మీడియాలో ఫొటోలు షేర్ చేశారో లేదో... వెంటనే శుభాకాంక్షల వెల్లువ మొదలైంది. ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్లో చాలామంది 'లవ్' ఎమోజి కామెంట్ చేశారు. ఐదు గంటల్లో ఫొటోని సుమారు ఆరున్నర లక్షలమంది లైక్ చేశారు. రేపు కాజల్, గౌతమ్ వివాహం జరగనున్న సంగతి తెలిసిందే.