కాజల్ వర్సెస్ బెల్లంకొండ: మిస్ యు నట్కేస్.. మిస్ యు మోర్!
on Jul 16, 2020
కాజల్ అగర్వాల్, తమన్నా వంటి హీరోయిన్లు తమ వ్యక్తిగత జీవితం గురించి ఏమీ మాట్లాడరు. కొంతమంది యాక్టర్లతో వాళ్ల పేర్లు కలిసి వినిపించినప్పడు, ఆ విషయంపై బహిరంగంగా ఒక్క మాటా చెప్పరు. అయితే తాజాగా కాజల్ అగర్వాల్ తన సోషల్ మీడియా అకౌంట్లో పెట్టిన పోస్ట్ ఒకటి అందరి కళ్లూ వెడల్పయ్యేలా చేసింది. లాక్డౌన్ కాలంలో ఓ టాలీవుడ్ యంగ్ హీరోను ఆమె బాగా మిస్సవుతోందట. ఆ హీరో.. బెల్లంకొండ శ్రీనివాస్! అవును. ప్రస్తుతం సోషల్ మీడియాలో కాజల్ చాలా యాక్టివ్‌గా ఉంటోంది. ఫ్యాన్స్‌కు తన క్వారంటైన్ లైఫ్ గురించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ అందిస్తూ వస్తోంది.
బుధవారం బెల్లంకొండ శ్రీనివాస్‌తో తను కలిసున్న ఓ ఫొటోను షేర్ చేసిన ఆమె, కొంతకాలంగా అతడిని మిస్సవుతున్నానంటూ రాసుకొచ్చింది. "మిస్ యు నట్కేస్ బెల్లంకొండ శ్రీనివాస్.. త్వరలోనే నిన్ను చూస్తాను" అనేది ఆ ఫొటోకు ఆమె పెట్టిన పోస్ట్. క్రేజీ పర్సన్‌ను 'నట్కేస్' అని సంబోధిస్తుంటారు. శ్రీనివాస్ కూడా దానికి వెంటనే స్పందించాడు. "Miss you more don’t say this when I can’t come and see you (sic)." అని రిప్లై ఇచ్చాడు. కాజల్ ఎంతో మంది హీరోలతో నటించింది. వాళ్లలో పేరు పొందిన స్టార్లు ఎందరో ఉన్నప్పటికీ, శ్రీనివాస్ లాంటి యంగ్ హీరోని మాత్రమే మిస్సవుతున్నానంటూ పోస్ట్ పెట్టడం అందరిలోనూ క్యూరియాసిటీని కలిగించింది. ఆ ఇద్దరి మధ్యా సమ్‌థింగ్ ఏదో జరుగుతోందంటూ గుసగుసలు మొదలయ్యాయి.
గతంలో కాజల్, శ్రీనివాస్ కలిసి నటించిన 'కవచం', 'సీత' సినిమాలు రెండూ బాక్సాఫీస్ వద్ద దెబ్బతిన్నాయి. అయినా ఇద్దరి మధ్యా మంచి స్నేహం ఏర్పడింది. ఇప్పుడు ఆ స్నేహం మరింత ముందుకెళ్లిందంటూ ఫిల్మ్‌నగర్ జనాలు చెవులు కొరుక్కుంటున్నారు.
Also Read