శూర్పనఖగా కాజల్
on Jul 6, 2018
కాజల్ అగర్వాల్ తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి పది సంవత్సరాలు దాటిపోతోంది. అయినా ఇంకా టాప్ హీరోయిన్లలో ఒకరిగా కొనసాగుతూనే ఉన్నారు. ఎప్పటికప్పుడు తనకి ప్రాధాన్యత ఉండే పాత్రలను ఎంచుకోవడమే ఆమె విజయ రహస్యం అంటారు విశ్లేషకులు. అవకాశం తనని నిరూపించుకునేందుకు ఎంత కష్టమైన పాత్రనయినా ఎంచుకునేందుకు కాజల్ వెనుకాడరు. ఇప్పుడు అదే నమ్మకంతో మరోసారి తన నటనని నిరూపించుకునేందుకు సిద్ధపడుతోందట. భార్గవ్ అనే దర్శకుడు తీయనున్న ఓ చిత్రంలో ఆమె శూర్పనఖ పాత్ర ధరించనున్నట్లు తెలిసింది. ఈ విషయమై దర్శకుడు ఆమెను సంప్రదించడం కూడా జరిగిపోయిందట. రామరావణ యుద్ధానికి పరోక్షంగా కారణం అయిన శూర్పనఖకు ప్రాధాన్యత కల్పించేలా ఈ చిత్రం ఉంటుందని తెలిసింది. రామరావణ పాత్రలు ఉన్నా కూడా సినిమా అంతా ఆమె చుట్టూనే తిరుగుతుందట.