పెద్దమ్మ కూడా అయిపోయింది.. మరి పెళ్లెప్పుడు..?
on Feb 23, 2018
టాలీవుడ్ టాప్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ చెల్లెలు నిషా అగర్వాల్ పండంటి బాబుకు జన్మనిచ్చింది. ఇంకేముంది కాజల్ పెద్దమ్మ అయిపోయింది. ఆనందంతో భూమి మీద నిలబడలేకపోతున్న కాజల్ తన చెల్లెలి కొడుకు పేరును "ఇషాన్" అని ప్రకటించింది. అంతా బాగానే ఉంది కానీ.. తన వెనుక పుట్టిన చెల్లిలికి పెళ్లవ్వడం.. ఆమె ఒక బిడ్డకు తల్లవ్వడం చూసి.. మీ సోదరి జీవితంలో స్థిరపడినట్లే.. మరి మీ పరిస్థితేంటని కొందరు అభిమానులు సోషల్ మీడియా వేదికగా కాజల్‌ను ప్రశ్నిస్తున్నారు. లక్ష్మీకళ్యాణంతో తెలుగునాట అడుగుపెట్టిన ఈ పంజాబీ ముద్దుగుమ్మ... వరుస బ్లాక్ బస్టర్లతో టాప్ హీరోయిన్గా వెలుగొందుతోంది.
ఆమెతో ప్రయాణం స్టార్ట్ చేసిన హీరోయిన్లంతా పెళ్లి చేసుకుంటుండగా.. కాజల్ మాత్రం పెళ్లిపై నోరు మెదపడం లేదు. ధైర్యం చేసి ఎవరైనా పెళ్లెప్పుడు అనడిగితే.. సరైనోడు దొరకాలి కదా అని తడుముకోకుండా సమాధానం చెబుతోంది. నిద్రలో లేపి అడిగిన సేమ్ ఆన్సర్ ఇస్తూ ఫ్యాన్స్‌ను డిజప్పాయింట్ చేస్తోంది. అప్పట్లో ముంబైకి చెందిన ఓ టాప్ బిజినెస్ మెన్‌తో ఈ అమ్మడు ప్రేమాయణాన్ని సాగిస్తోందని.. వీరి పెళ్లికి ఇరు కుటుంబాలు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేశాయని వార్తలు వచ్చినప్పటికీ.. ఆ తర్వాత అవన్నీ గాలి వార్తలుగా తేలిపోయాయి. పోనీ ఏదైనా గుడ్‌న్యూస్ చెబుతుందా అని ఎదురుచూస్తే... వరుస పెట్టి సినిమాలకు కమిటవుతున్న న్యూసే కానీ.. పెళ్లి కబురు లేదు. మరి.. కాజల్, ఆ శుభవార్త అభిమానుల చెవిన ఎప్పుడు వేస్తోందో.. వేచి చూడాల్సిందే.