`సీత`తో అంత వీజీ కాదు!!
on Jan 10, 2019
`సీత`తో అంత వీజీ కాదంటూ ఒక సినిమాలో తన గురించి గొప్పగా చెప్పుకుంటూ బడాయి పోతుంది ఓ హీరోయిన్. అలాగే ఇప్పుడు కాజల్ కూడా సీతతో అంత వీజీ కాదంటూ...`సీత` సినిమాతో నేనేంటో చూపిస్తానంటోంది కాజల్. ఇటీవల ఓ మీడియాతో మాట్లాడుతూ...పై విధంగా స్పందించింది కాజల్. ఇంకా ఆమె మాట్లాడుతూ...`` హీరోయిన్స్ కి కూడా తన నటనను ప్రదర్శించాలని ఉంటుంది..కానీ అలాంటి స్టోరీస్ రావాలి కదా!!. అలాంటి పాత్రలో ఎప్పుడో ఒకసారి వస్తుంటాయి. అవి వచ్చినప్పుడు వదులుకోవద్దు. మనం ఎన్ని సినిమాలు చేసినా...ఎప్పటికీ గుర్తుండేవి మాత్రం ఐదో ఆరో ఉంటాయి. ప్రతి సినిమాలో కొత్తగా కనిపించాలని ప్రతీ హీరోయిన్ కి ఉంటుంది. అంటూ హీరోయిన్స్ అందరి తరఫున మాట్లాడకొచ్చింది కాజల్. ప్రస్తుతం కాజల్ తేజ దర్శకత్వంలో `సీత` సినిమాలో నటిస్తోంది. అలాగే తమిళ వెర్షన్ `క్వీన్` సినిమాలో కూడా నటిస్తోంది. ఈ రెండు సినిమాలతో నటిగా తనేంటో నిరూపించుకుంటానని కాన్ఫిడెంట్ గా చెప్పుకొస్తోందీ సన్నజాజి కాజల్.