కాలా సూపర్‌హిట్ కాదు కానీ...
on Jun 7, 2018
ఎంతో కాలంగా దక్షిణాది రాష్ట్రాల ప్రజలంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న కాలా సినిమా మొదటి ఆట పడిపోయింది. కాలా స్పెషల్ షోలు చూసిన వారు, సినిమా మీద తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. ఇప్పటివరకూ బయట వినిపించన కథనే తెర మీద చూపించారని చెప్పుకుంటున్నారు. ఒక దక్షిణాదివాడు ముంబైలోని ధారావి ప్రాంతానికి చేరుకోవడం, అక్కడి ప్రజలకు నాయకుడులా మారడం, వారిని రాజకీయ నాయకుల నుంచి కాపాడటం... లాంటి ఘట్టాలే ఇందులో ఉన్నాయట. కాకపోతే ఎప్పటిలాగే రజనీకాంత్ తన నటనతో ఈ సినిమాని ఒంటిచేత్తో గెలిపించేశాడట. ఇక ‘భూమి మీద హక్కు’ అనే పాయింట్‌ని బలంగా చూపించి, దాన్ని తన రాజకీయ నినాదంగా మలచుకునే ప్రయత్నం చేశారట రజనీ! అయితే ఆకట్టుకోని పాటలు, నిదానంగా గడిచే కథనం సినిమాకి మైనస్సే అని చెబుతున్నారు. మొత్తానికి కబాలి లాగా కాలాని కూడా ఒకసారి నిర్మొహమాటంగా చూసేయవచ్చని చెబుతున్నారు.