ట్రైలర్ అదరహో..
on Aug 22, 2017
కొన్ని కథలు ఏ భాషలో తీసినా హిట్టే అవుతాయ్. వాటికి నేటివిటీతో పనుండదు. అలాంటి కథే ‘హలోబ్రదర్’. 1994లో నాగార్జున చేసిన ఈ సినిమా.. తెలుగులో బంపర్ హిట్. హిందీలో ‘జుద్వా’ పేరుతో సల్మాన్ ఖాన్ చేస్తే... అక్కడా సూపర్ హిట్. ఇప్పుడు వరుణ్ ధావన్ ‘జుద్వా 2’ పేరుతో మళ్లీ చేస్తున్నాడు. మళ్లీ సూపర్ హిట్ అవుతుందని ప్రత్యేకంగా చెప్పాలా? ఈ కథలో ఉండే కమర్షియల్ ఎలిమెంట్స్ అలాంటివి మరి. రీసెంట్ గా ఈ సినిమా ట్రైలర్ విడుదల చేశారు. ఆ ట్రైలర్ చూస్తే.. ఎవరైనా ‘అదరహో’ అనకమానరు. ఆ రేంజ్ లో ట్రైలర్ ని కట్ చేశారు.
వరుణ్ ధావన్ తండ్రి డేవిడ్ ధావన్ ఈ సినిమాకు దర్శకుడు. ట్రైలర్ చూస్తుంటే... కథలో ఏ మాత్రం మార్పూ చేసినట్లు లేరు. అయితే... కథనంలో అయితే మార్పులు కనిపించాయ్. యువతరానికి నచ్చే తీరులో బోల్డ్ గా పాష్డ్ గా... డేవిడ్ ధావన్ చిత్రాన్ని మలిచినట్లు అర్థమవుతుంది. ట్రైలర్ మొత్తం కామెడీనే. ఇక తాప్సీ, జాక్వెలిన్ ఫెర్నాండేజ్ అయితే.. అందాల ఆరబోతలో పోటీపడ్డారంటే నమ్మండి. ట్రైలర్ లోనే రెండుమూడు ముద్దు సీన్లు కనిపించేస్తున్నాయ్. మరి సినిమాలో ఎన్నుంటాయో మరి. మొత్తంగా బాలీవుడ్ లో హిట్టుల కొరత ఈ సినిమాతో తీరిపోయేట్లుంది.
ఎలాగూ... నాగార్జున చేసిన సినిమానే కాదా... తెలుగులో కూడా ‘జుద్వా 2’ రీమేక్ చేసేస్తే... ఎంచక్క ఆ సినిమాలో నాగచైతన్యో, లేక అఖిలో నటించేస్తే.. ఎంత బావుండ్నో కదా. మరి ఈవీవీ రేంజ్ లో జనరంజకంగా తీసే దర్శకుడు ఇప్పుడెవరున్నారబ్బా!
Also Read