జూనియర్ ఎన్టీఆర్31 బ్యాక్డ్రాప్ ఏంటంటే?
on May 29, 2020
టాలీవుడ్ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో నటిస్తున్న 'ఆర్ఆర్ఆర్: రౌద్రం రణం రుధిరం' యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్కి 29వ సినిమా. దీని తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. అది ఎన్టీఆర్ 30వ సినిమా. 'ఆర్ఆర్ఆర్' పీరియాడిక్ బ్యాక్డ్రాప్ సినిమా అయితే... త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ చేయనున్నది ఫ్యామిలీ అండ్ ఎమోషనల్ కమర్షియల్ ఎంటర్టైనర్. అభిమానులు, ప్రేక్షకులు తారక్ నుండి కోరుకునే మాస్ అంశాలతో పాటు తన నుండి కోరుకొనే వినోదం, ఫ్యామిలీ అంశాలతో త్రివిక్రమ్ స్క్రిప్ట్ రెడీ చేస్తున్నారట.
రాజమౌళి, త్రివిక్రమ్ సినిమాల తర్వాత 'కెజిఎఫ్' ఫేమ్, కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్తో తారక్ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. అది అతనికి 31వ సినిమా. ఆల్రెడీ దర్శకుడికి మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలు అడ్వాన్స్ ఇచ్చారు. అతడు హీరోని కలిసి కథ గురించి డిస్కస్ చేశాడు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు... జూనియర్ ఎన్టీఆర్31 బ్యాక్డ్రాప్ కూడా పీరియాడిక్ డ్రామా. పాన్ ఇండియన్ లెవెల్లో దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్లాన్ చేస్తున్నాడట. బడ్జెట్ కూడా భారీగా ఉంటుందని తెలిసింది. తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో విడుదల చేయాలని అనుకుంటున్నారట. 'ఆర్ఆర్ఆర్'తో తారక్ పాన్ ఇండియన్ మార్కెట్ ని టార్గెట్ చేశాడు. తర్వాత చేయబోయే సినిమాలు కూడా అదే లెవెల్లో ఉండబోతున్నాయన్నమాట.
Also Read