ఎన్టీఆర్ నోట విజయ్ పాట?
on Feb 19, 2020
తమిళంలో విజయ్ పాడిన 'కుట్టి స్టోరీ' పాటను తెలుగులో యంగ్ టైగర్ ఎన్టీఆర్ పాడుతున్నాడా? అతడితో పాడించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయా? అంటే ఫిలింనగర్ వర్గాల నుండి అవుననే సమాధానం వినిపిస్తోంది. తమిళ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న లేటెస్ట్ సినిమా 'మాస్టర్'. అనిరుధ్ సంగీత దర్శకుడు. కార్తీతో 'ఖైదీ' వంటి హిట్ సినిమా తీసిన లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో విజయ్ ఒక సాంగ్ పాడాడు. అది నెట్టింట వైరల్ అయ్యింది. విజయ్ పాడడం అనే పాయింట్ ఆడియన్స్ ని అట్ట్రాక్ట్ చేసింది. తెలుగులో ఆ సాంగ్ ఎన్టీఆర్ తో పాడించాలని ట్రై చేస్తున్నారట.
తెలుగులో 'మాస్టర్' సినిమాను ఎన్టీఆర్ సన్నిహితుడు, నిర్మాత మహేష్ కోనేరు విడుదల చేస్తున్నారు. ఎన్టీఆర్ దగ్గర సాంగ్ ప్రపోజల్ ఆయనే పెట్టాడట. ఎన్టీఆర్ ఏమంటారో? ఇంతకు ముందు ఎన్టీఆర్ తన సినిమాల్లో ఐదారు పాటలు పాడారు. బయట హీరోలకు అయితే ఒక్క పాట మాత్రమే పాడారు. కన్నడలో పునీత్ రాజ్ కుమార్ హీరోగా నటించిన 'చక్రవ్యూహ'లో 'గెలియా గెలియా' పాట పాడారు.