ఎన్టీఆర్ మటన్ బిర్యానీ రెసీపీ
on Sep 18, 2017
జూనియర్ ఎన్టీఆర్ గరిటె తిప్పడంలో స్పెషలిస్ట్ అని చాలామందికి తెలిసిన మాట. ఖాళీగా ఉన్న సమయంలో కిచెన్‌లోకి దూరి తన పాకశాస్త్ర ప్రావిణ్యాన్ని కుటుంబసభ్యులకు తెలియజేస్తూ ఉంటాడు. ఇంట్లో వాళ్లకే తెలిసిన తన ప్రతిభను ఇప్పుడు ప్రపంచానికి చాటి చెప్పాడు ఎన్టీఆర్. హిందీలో సూపర్‌హిట్టైన బిగ్‌బాస్ షోకు తెలుగులో జూనియర్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా సీజన్-1 ఫైనల్ దశకు చేరుకుంది..ఇప్పటికే పాపులర్ అయిన ఈ షోకి మరింత టీఆర్పీ సాధనే లక్ష్యంగా యంగ్‌టైగర్ రంగంలోకి దిగాడు. స్వయంగా బిగ్‌బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చి చెఫ్ అవతారం ఎత్తాడు. జైలవకుశ ప్రమోషన్లో భాగంగా బిగ్‌బాస్‌కు వచ్చిన కళ్యాణ్‌రామ్ తన తమ్ముడి పాకశాస్త్ర ప్రావీణ్యాన్ని వర్ణించాడు. మావాడు బిర్యానీ చేస్తే ఫ్రీజ్‌లో దాచుకుని మరీ తింటా అనడంతో కంటెస్టెంట్స్ మాకు కూడా దాని టెస్ట్ చూపించాలని కోరారు. దానితో హౌస్ మెట్స్ కోసం మటన్పలావ్, టమోటా పచ్చడి చేసి వడ్డించాడు. ఎన్టీఆర్ బిర్యానీ రుచి చూసిన హౌస్మేట్స్ అంతా షాకై..ఫ్రీజ్‌లో పెట్టుకుని రెండోపూట కూడా తింటామన్నారు. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే హరితేజ వెజిటేరియన్ కావడంతో ఆమె కోసం టమోటా పచ్చడి చేశాడు జూనియర్.