బయోపిక్ హాట్ న్యూస్... బాబాయ్ అబ్బాయ్
on Sep 10, 2018
హరికృష్ణ హఠాన్మరణంతో బాలకృష్ణ తన అన్న హరికృష్ణ ఫ్యామిలిని తండ్రి స్థానంలోకి ఓదార్చాడు. ప్రస్తుతం ఎన్టీఆర్, కళ్యాన్ రామ్‌లకు ఆయన తండ్రి స్థానంలో ఉంటూ అన్ని కార్యక్రమాలు చక్క బెడుతూ వస్తున్నారు. దీంతో బాలకృష్ణ , ఎన్టీఆర్ మరింత దగ్గరయ్యారు. ఈ నెల 20న జరగనున్న `అరవింద సమేత` ఆడియోకు ముఖ్య అతిథిగా హాజరయ్యే అవకాశాలున్నట్లు ఇటీవల సోషల్ నెట్ వర్క్స్ లో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఇదిలా ఉంటే రోజుకో కొత్త వార్తతో నిత్యం వార్తలో ఉండే `ఎన్టీఆర్` బయోపిక్ చిత్రానికి సంబంధించి హాట్ న్యూస్ ఒకటి వైరల్ అవుతోంది.
అదేమిటంటే...`ఎన్టీఆర్` సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా నటించబోతున్నాడనే న్యూస్. ఇప్పటికే హరికృష్ణ పాత్ర కోసం కళ్యాన్ రామ్ ని తీసుకున్నట్లు తెలిసింది. మరి యంగ్ టైగర్ ని తీసుకుంటే ఇందులో ఏ క్యారక్టర్ చేయనున్నాడు? ఏంటి అన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. ఈ వార్త ఎప్పుడైతే బయటకు వచ్చిందో అప్పటి నుంచి ఎవరికి తగ్గట్టుగా వారు ఊహించేస్తున్నారు. అందులో ముఖ్యంగా నటసింహం బాలకృష్ణ పాత్రను ఎన్టీఆర్ తో చేయిస్తారేమో అన్న వార్త బాగా వినిపిస్తోంది. ఇదే గనుక నిజమైతే ఎన్టీఆర్ సినిమా ఒక సంచలనం అవుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. చూద్దాం రోజుకో వార్తతో హైప్ క్రియేట్ చేసుకుంటున్న ఈచిత్రం ప్రేక్షకులను ఎంత మేరకు ఆకట్టుకుంటుందో. ఏది ఏమైనా ఇలా హరికృష్ణ లేని లోటు బాలయ్య బాబు తీర్చుతూ ఎన్టీఆర్ , కళ్యాన్ రామ్ లకు ఎప్పటికీ అండగా ఉంటే బావుంటందంటున్నారు నందమూరి అభిమానులు.