జూనియర్ బాలయ్య ఎవరో తెలుసా??
on Mar 18, 2017
నందమూరి తారక రామారావు మనవడ్ని జూ.ఎన్టీఆర్ అంటూ అభిమానులు ప్రేమగా పిలుచుకొంటారు. మరి జూనియర్ బాలకృష్ణ కూడా ఉన్నారా?? ఉంటే ఎవరు?? ఆ బిరుదు ఎవరు ఎవరికి ఇచ్చారు?? అనుకొంటున్నారా. అక్కడికే వస్తున్నాం. కమెడియన్ ఫృథ్వీని జూనియర్ బాలకృష్ణ గా మార్చేశారు నందమూరి అభిమానులు. అవును.. 30 ఇయర్స్ ఇండ్రస్ట్రీగా ముద్దుగా పిలుచుకొనే ఫృథ్వీకి జూ. బాలయ్య అనే బిరుదు ఇచ్చేశారు. ఇంకెవరో కాదు.. నందమూరి అభిమానులే. ఆమధ్య తన పుట్టిన రోజు సందర్భంగా కొంతమంది బాలయ్య అభిమానులు ఫృథ్వీకి మెసేజ్లు పెట్టారట. జూనియర్ బాలయ్యకు హ్యాపీ బర్త్డే అని. ఆ మెసేజీలు చూసి మురిసిపోయాడట పృథ్వీ.
ఈ విషయాన్ని ఈ హాస్య నటుడే మీడియాకు లీక్ చేసేశాడు. బాలయ్య సినిమాల్లోని డైలాగుల్ని, సన్నివేశాల్నీ స్నూఫ్ చేసి ఆకట్టుకొన్నాడు ఫృథ్వీ. ఓ సందర్భంలో ఈ స్నూఫ్లు మరీ ఎక్కువవడం వల్ల బాలయ్య ఫ్యాన్స్ మనోడికి గట్టిగా వార్నింగ్ కూడా ఇచ్చారు. అప్పుడే బాలయ్య ఫ్యాన్స్కి సారీ చెప్పాడు ఫృథ్వీ. వాళ్లే మనోడ్ని జూనియర్ బాలయ్య అన్నారంటే.. అంతకంటే కావల్సింది ఏముంది? ఇక ముందు బాలయ్య డైలాగుల్ని, సన్నివేశాల్ని స్నూఫ్ చేయడానికి అనుమతులు వచ్చేసినట్టే. ఇక ఫృథ్వీ మరింత రెచ్చిపోవడం ఖాయమన్నమాట.