ఎన్టీఆర్ @ సెంచరీ!
on Dec 4, 2018
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన 'అరవింద సమేత వీరరాఘవ' సినిమా రీసెంట్గా హాఫ్ సెంచరీ మార్క్ దాటింది. హీరో మాత్రం సెంచరీ దాటేసి వెళ్తున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ బరువు వంద కిలోలకు పైనే ఉందని 'ఆర్.ఆర్.ఆర్' యూనిట్ సభ్యులు చెప్పే మాట! సినిమా కోసమే ఆయన విపరీతంగా బరువు పెరిగారనీ... 'ఆర్.ఆర్.ఆర్'లో భారీకాయంతో, గడ్డంతో కనిపిస్తారని యూనిట్ చెబుతోంది. 'అరవింద సమేత..' షూటింగ్ టైమ్ నుంచి సెలబ్రిటీ ఫిట్నెస్ ట్రైనర్ లాయిడ్ స్టీవెన్స్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ బాడీ బిల్డింగ్ వర్కవుట్స్ చేస్తున్నారు. సినిమా అంతా వంద కిలోల బరువుతో భారీకాయంతో కనిపిస్తారో? ఏదైనా యాక్షన్ సీక్వెన్స్‌కి మాత్రమే ఈ లుక్కు పరిమితం చేస్తారో? రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా నటిస్తున్న 'ఆర్.ఆర్.ఆర్' షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. హీరోలు ఇద్దరిపై భారీ యాక్షన్ సీక్వెన్స్ తెరకెక్కిస్తున్నారు రాజమౌళి. మరో రెండు మూడు రోజుల్లో ఈ షెడ్యూల్ ముగుస్తుందని టాక్.