`రాంపేజ్` డైరెక్టర్‌తో జెన్నిఫర్ లోఫెజ్?
on Jun 17, 2021
హాలీవుడ్ లో అత్యధిక పారితోషికం పుచ్చుకుంటున్న నటీమణుల్లో జెన్నిఫర్ లోపెజ్ ఒకరు. `అనకొండ` వంటి జనరంజక చిత్రాల్లో తనదైన అభినయంతో అలరించిన ఈ అమెరికన్ సింగర్.. త్వరలో ఓ సైన్స్ ఫిక్షన్ మూవీ చేయబోతున్నారు. `జర్నీ 2`, `రాంపేజ్` లాంటి సక్సెస్ ఫుల్ సైన్స్ ఫిక్షన్ మూవీస్ ని తెరకెక్కించిన బ్రాడ్ పేటన్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయనున్నారు. దిగ్గజ ఓటీటీ వేదిక నెట్ ఫ్లిక్స్ నిర్మించనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి `అట్లాస్` అనే టైటిల్ ని ఫిక్స్ చేశారు.
కృత్రిమ మేథతో రూపొందిన సైనికుల కారణంగా పొంచి ఉన్న అపాయం నుంచి మానవాళిని `అట్లాస్` అనే మహిళ ఎలా కాపాడింది? అనే కథాంశంతో ఈ సైన్స్ ఫిక్షన్ మూవీ తెరకెక్కనుంది. జోబీ హెరాల్డ్, టోనీ టన్నెల్ ఈ భారీ బడ్జెట్ మూవీని సంయుక్తంగా నిర్మించనున్నారు. మరి.. `అట్లాస్`తో నటిగా జెన్నిఫర్ లోపెజ్ ఎలాంటి గుర్తింపుని పొందుతుందో చూడాలి.
కాగా, జెన్నీఫర్ ప్రస్తుతం `మ్యారీ మీ`, `షాట్ గన్ వెడ్డింగ్` చిత్రాల్లో నటిస్తున్నారు. రొమాంటిక్ కామెడీ జానర్ లో తెరకెక్కుతున్న ఈ రెండు సినిమాలు కూడా 2022లో రిలీజ్ కానున్నాయి. అంతేకాదు.. ఈ రెండు చిత్రాలకూ నిర్మాతల్లో ఒకరిగా వ్యవహరిస్తున్నారు ఈ `యూటర్న్` యాక్ట్రస్.