హెల్త్ బులిటెన్: జీవిత డిశ్చార్జ్... నిలకడగా రాజశేఖర్ ఆరోగ్యం
on Oct 24, 2020
ప్రముఖ కథానాయకుడు రాజశేఖర్ కరోనాతో పోరాడుతున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్ సిటీలోని సిటీ న్యూరో సెంటర్ హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్నారు. రెండు రోజుల క్రితం గురువారం నాడు ఆయనను ఐసీయూలో ఉంచి నాన్-ఇన్వేజివ్ వెంటిలేటర్ సహాయంతో చికిత్స అందిస్తున్నట్టు హాస్పిటల్ వర్గాలు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. తాజాగా శనివారం మధ్యాహ్నం మరో బెర్త్ బులిటెన్ విడుదల చేశాయి. రాజశేఖర్ ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని అందులో పేర్కొన్నారు. యాంగ్రీ స్టార్ చికిత్సకు స్పందిస్తున్నారని వెల్లడించారు.
కరోనాతో సిటీ న్యూరో హాస్పిటల్ లో చేరిన రాజశేఖర్ భార్య జీవితను డిశ్చార్జ్ చేసినట్టు హాస్పిటల్ వర్గాలు ప్రకటించాయి. ఆమెకు కొవిడ్-19 టెస్ట్ చేయగా, రిజల్ట్ నెగెటివ్ వచ్చినట్టు తెలిపాయి. డాక్టర్ కృష్ణ నేతృత్వంలోని వైద్య బృందం తమ తండ్రిని జాగ్రత్తగా చూసుకుంటున్నారని, ప్రస్తుతం నాన్నగారి ఆరోగ్యం నిలకడగా ఉందని రాజశేఖర్ కుమార్తెలు శివాని, శివాత్మిక పేర్కొన్నారు.