కరోనాతో మరో హాలీవుడ్ నటి మృతి
on Apr 7, 2020
కరోనా మహమ్మారి వేలాదిమందిని బలి తీసుకుంటోంది. కోవిడ్19 కోరలకు బలవుతున్న ప్రజల్లో యాక్టర్స్, టెక్నిషియన్స్ ఉంటున్నారు. 'స్టార్ వార్స్' యాక్టర్ ఆండ్రూ జాక్ (76), గ్రామీ అవార్డు విన్నింగ్ మ్యూజిక్ సింగర్ జో డిఫ్ఫే (61), అమెరికన్ మ్యూజిషియన్ అలన్ మెరిల్ (69), జపనీస్ కమెడియన్ కిన్ షిమురా (70), ఇటాలియన్ నటి లూసియా బోస్ (89) తదితరులు కరోనా కారణంగా మరణించారు.
మరో విషాదం ఏంటంటే... లీ ఫియర్రో (91) కూడా కరోనాతో మరణించారు. ప్రముఖ హాలీవుడ్ దర్శక నిర్మాత స్టీవెన్ స్పీల్బర్గ్ తీసిన కల్ట్ క్లాసిక్ ఫీచర్ 'జాస్'లో లీ నటించారు. అందులో ఆమె పోషించిన మిసెస్ కిన్నర్ పాత్ర ఆమెకు మంచి పేరు తీసుకొచ్చింది. అమెరికాలోని ఒహియోలో లీ ఫ్యామిలీ నివసిస్తోంది. సోషల్ డిస్టెన్స్ మైంటైన్ చేస్తూ వారు ఏదో ప్రోగ్రామ్ ప్లాన్ చేశారట.