కుశ టీజర్ రివ్యూ
on Sep 8, 2017
కెరీర్లోనే తొలిసారిగా ఒకే సినిమాలో మూడు రకాల పాత్రలు పోషిస్తున్నాడు యంగ్‌టైగర్ ఎన్టీఆర్. అదే జైలవకుశ. ఇప్పటికే ఈ చిత్రంలోని జై, లవకుమార్ పాత్రలకి సంబంధించిన టీజర్స్‌ను విడుదల చేసింది యూనిట్. వాటికి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. మరి మూడో క్యారెక్టర్ అయిన కుశ టీజర్ ఎప్పుడు వస్తుందా అని ప్రేక్షకులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో కుశ టీజర్‌ను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. జై పాత్ర సీరియస్ మోడ్‌లో ఉండగా..లవకుమార్ చాలా ఇన్నోసెంట్‌గా ఉంది. కానీ కుశ మాత్రం సరదాగా ఉన్నాడు..కొట్టేయడంతో పాటు కొట్టడం కూడా వచ్చురా అంటూ ఎన్టీఆర్ చెబుతున్న డైలాగ్‌ను బట్టి కుశ రోల్ వినోదంతో పాటు యాక్షన్‌ని కూడా పంచుబోతుందన్న మాట. ఎన్టీఆర్ సరసన రాశీఖన్నా, నివేదా థామస్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి దేవీశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. బాబీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌పై నందమూరి కళ్యాణ్‌రామ్ నిర్మిస్తున్నారు. దసరా కానుకగా సెప్టెంబర్ 21న జైలవకుశ ప్రేక్షకుల ముందుకు రానుంది.