English | Telugu

జై సింహా ఫస్టాఫ్ రివ్యూ

on Jan 11, 2018

టాలీవుడ్‌లో సంక్రాంతి సందడి జోరందుకుంది. ఇప్పటికే పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ అజ్ఞాతవాసిగా కలెక్షన్ల దుమ్ము దులుపుతున్నాడు. ఇక సంక్రాంతికి ఎవరి సినిమా ఉన్నా లేకపోయినా తన సినిమా ఉండేలా చూసుకునే నటసింహం నందమూరి బాలకృష్ణ. గతేడాది గౌతమీపుత్ర శాతకర్ణితో గ్రాండ్ విక్టరీ కొట్టగా.. ఈ సారి జైసింహాగా కాలుదువ్వుతున్నాడు. తమిళ డైరెక్టర్ కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై పెద్దగా ఎక్స్‌పెక్టేషన్స్ లేవు.. కానీ ఏ మాత్రం అంచనాలు లేకుండా గర్జించడం బాలయ్య స్టైల్. పవర్‌స్టార్ అజ్ఞాతవాసికి డివైడ్ టాక్ రావడంతో ఇప్పుడు అందరిచూపు జైసింహా మీద పడింది.

ఒకరోజు ముందే అమెరికాలోని కొన్ని ప్రాంతాల్లో ప్రీమియర్ షోలు పడటంతో పాటు ఏపీలోనూ కొన్ని చోట్ల.. స్పెషల్ షోలు పడటంతో సోషల్ మీడియా ద్వారా కొందరు అభిమానులు సినిమా విశేషాలను సన్నిహితులతో పంచుకుంటున్నారు. ఫస్టాఫ్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా నడిచిందట.. యాక్షన్, కామెడీతో బాలయ్య ఫుల్‌గా ఎంటర్‌టైన్ చేశాడట. ముఖ్యంగా బాలకృష్ణ నుంచి ఆశించే పవర్‌ఫుల్ డైలాగ్స్‌కు విజిల్సేనట. అమ్మకుట్టి సాంగ్‌తో పాటు బ్రాహ్మాణుల గొప్పదనం గురించి వివరిస్తూ తీసిన సీన్ హైలెట్‌గా నిలిచిందట. మొత్తం మీద ఫస్టాఫ్ ప్రేక్షకులని బాగానే ఎంటర్‌టైన్ చేసింది. మరి బాలయ్య సంక్రాంతికి హిట్ కొడతాడో లేదో తెలియాలంటే కొద్దిగంటలు వెయిట్ చేయాల్సిందే.    

Also Read



Latest News



Customer Service

Live Help 24/7Customer Care

teluguone.teluguone@gmail.com

Send your Queries to

support@teluguone.com

Follow Us Here