రంభకి ఫ్యాన్ గా జగ్గూభాయ్
on Apr 21, 2021
90ల్లో తన గ్లామర్ తో కుర్రకారుకి కునుకు లేకుండా చేశారు అందాల తార రంభ. దక్షిణాదిలోనే కాదు ఉత్తరాదిలోనూ నటిగా తనదైన ముద్రవేశారు ఈ టాలెంటెడ్ యాక్ట్రస్. మరీ ముఖ్యంగా.. నృత్యాలతో తనకంటూ ఓ ప్రత్యేక అభిమానగణాన్ని సొంతం చేసుకున్నారామె.
అలాంటి రంభని దృష్టిలో పెట్టుకుని తన అప్ కమింగ్ ఫిల్మ్ `మహాసముద్రం` కోసం ఓ స్పెషల్ సాంగ్ ని డిజైన్ చేశాడట `ఆర్ ఎక్స్ 100` ఫేమ్ అజయ్ భూపతి. అయితే, ఈ పాటలో రంభ కనిపించరు. ఆమె కటౌట్, ఫొటోస్ మాత్రమే దర్శనమిస్తాయట. వైజాగ్ లో షూట్ చేసిన ఈ పాటని శర్వానంద్, జగపతిబాబుపై చిత్రీకరించారట. రంభకి ఫ్యాన్ అయిన జగ్గూభాయ్.. ఆమెపై తన అభిమానాన్ని వర్ణించే నేపథ్యంలో ఈ పాట వస్తుందని టాక్. అంతేకాదు.. కథలో ఈ పాటకు ఉన్న ప్రాధాన్యతని వివరించి రంభ అనుమతితోనే ఈ గీతాన్ని పిక్చరైజ్ చేశాడట డైరెక్టర్ అజయ్. మరి.. `మహాసముద్రం`కి ఈ సాంగ్ ఎంతవరకు ప్లస్సవుతుందో చూడాలి.
సిద్ధార్థ్, అదితిరావ్ హైదరీ, అను ఇమ్మాన్యుయేల్ ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్న `మహాసముద్రం` ఆగస్టు 19న రిలీజ్ కానుంది. `ఆర్ ఎక్స్ 100` ఫేమ్ చేతన్ భరద్వాజ్ బాణీలు అందిస్తున్నాడు.