పవన్ సినిమాకి ఆమె డేట్స్ 40 చాలు!
on Mar 31, 2020
కరోనా ఎఫెక్ట్ లేకపోతే ఈపాటికి బాలీవుడ్ హీరోయిన్ జాక్వలైన్ ఫెర్నాండేజ్ హైదరాబాద్‌లో ల్యాండ్ అయ్యి చాలా రోజులు అయ్యేది. 'సాహో'లో ప్రభాస్‌తో 'బ్యాడ్ బాయ్' సాంగులో ఆడిపాడిన ఈ శ్రీలంక సుందరి, పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో ఏఎం రత్నం నిర్మిస్తున్న పీరియాడిక్ సినిమాలో హీరోయిన్గా సెలెక్ట్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు జాక్వలైన్ ఫెర్నాండేజ్ డేట్స్ 40 చాలు అని యూనిట్ వర్గాల సమాచారం. హీరోయిన్ మీద తీయవలసిన సన్నివేశాలను 40 రోజుల్లో పూర్తి చేసేలా దర్శకుడు క్రిష్ ప్లాన్ చేశారట. దుస్తులు, నగలతో రాకుమారిలా జాక్వలైన్ క్యారెక్టర్ ఉంటుందట. ఆల్రెడీ హైదరాబాద్ రెండు మూడు సార్లు వచ్చిన ఆమె... హీరో పవన్, దర్శకుడు క్రిష్‌ను కలిశారట. కథ, పాత్ర తీరుతెన్నులు తెలుసుకుని ముంబై వెళ్లారట.
తెలుగు సహా హిందీ, తమిళం, మలయాళంలో సినిమాను విడుదల చేయాలని అనుకుంటున్నారు. 1980 నేపథ్యంలో సాగే కథతో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిస్తున్నారు. ఆల్రెడీ హైదరాబాద్ లో షూటింగ్ స్టార్ట్ చేశారు. రెండు మూడు షెడ్యూల్స్ కంప్లీట్ చేశారు. కరోనా తీవ్రత తగ్గిన తర్వాత కొత్త షెడ్యూల్ స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.