షూటింగ్లో దెబ్బతిన్న హీరోయిన్ కంటిచూపు
on Jun 11, 2018
నిన్న మొన్నటి వరకూ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఎవరో ప్రేక్షకులకి పెద్దగా పరిచయం లేదు. కానీ రేస్-3 లో సల్మాన్‌కు జోడీగా నడిస్తుండటంతో ఆమె గురించి ఆసక్తి పెరిగిపోయింది. ఇంతకీ పాపం ఆ రేస్-3 సినిమానే జాక్వెలిన్ కొంప ముంచిందట. రేస్-3 షూటింగ్ అబుదాబిలో జరుగుతున్న సమయంలో జాక్వెలిన్ కంటి మీద బలమైన గాయమైంది. అదేదో చిన్న దెబ్బే అనుకున్నారు కానీ తీరా దానివల్ల జాక్వెలిన్ కనుగుడ్డు ఆకృతి మారిపోయిందట. అదింక బాగుపడదని తేలిపోవడంతో రేస్- 3 అందించిన జ్ఞాపకం అంటూ సరిపెట్టేసుకుందట ఈ ముద్దుగుమ్మ.