వరుణ్.. సెంటిమెంట్ రిపీట్ అయ్యేనా?
on Jan 17, 2021
కథానాయకుడిగా ఇటీవలే 6 సంవత్సరాల కెరీర్ ని పూర్తిచేసుకున్నాడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్. ఈ ప్రయాణంలో పూరీ జగన్నాథ్, శ్రీను వైట్ల, హరీష్ శంకర్, శేఖర్ కమ్ముల, క్రిష్, శ్రీకాంత్ అడ్డాల, అనిల్ రావిపూడి వంటి పాపులర్ డైరెక్టర్స్ తోనే ఎక్కువగా పనిచేశాడు. అయితే ఒకే ఒక సినిమా కోసం కొత్త దర్శకుడితో జట్టుకట్టాడు వరుణ్. ఆ దర్శకుడే వెంకీ అట్లూరి. తొలిప్రేమ కోసం ఈ మాజీ కథానాయకుడికి కెప్టెన్ గా ఫస్ట్ ఛాన్స్ ఇచ్చాడు ఈ కొణిదెల కుర్రాడు. ఆ ప్రయత్నం మంచి ఫలితాన్నే ఇచ్చింది.
కట్ చేస్తే.. మూడేళ్ళ తరువాత మరో నూతన దర్శకుడికి అవకాశమిస్తూ ఓ స్పోర్ట్స్ డ్రామా చేస్తున్నాడు వరుణ్. కెరీర్ లో ఫస్ట్ టైమ్ బాక్సర్ రోల్ చేస్తున్న ఈ సినిమా ద్వారా కిరణ్ కొర్రపాటి డైరెక్టర్ గా ఇంట్రడ్యూస్ కానున్నాడు. మరి.. సెంటిమెంట్ రిపీట్ అయి వెంకీ లాగే కిరణ్ కూడా వరుణ్ కి మెమరబుల్ హిట్ ని ఇస్తాడేమో చూడాలి.
కాగా, వరుణ్ తేజ్ బర్త్ డే సందర్భంగా జనవరి 19న కిరణ్ కొర్రపాటి డైరెక్టోరియల్ (VT 10) కి సంబంధించి ఫస్ట్ లుక్ రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమాలో దబాంగ్ 3 ఫేమ్ సయీ మంజ్రేకర్ నాయికగా నటిస్తోంది.
Also Read