'వి' ఎఫెక్ట్: ఈసారి ప్రేమ కథతో ఇంద్రగంటి?
on Sep 17, 2020
క్లీన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమాలతో దర్శకుడు మోహన కృష్ణ ఇంద్రగంటి ప్రేక్షకుల్లో మంచి పేరు తెచ్చుకున్నారు. ఆయన రూటు మార్చి తీసిన సినిమా 'వి'. భారీ బడ్జెట్, స్టార్ కాస్ట్, ఏస్ ప్రొడ్యూసర్ కాంబినేషన్ లో యాక్షన్ థ్రిల్లర్ తీశారు. రిజల్ట్ తేడా కొట్టింది. దర్శకుడిగా ఇంద్రగంటి ప్రతిభ పై విమర్శలు వచ్చాయి. ఆయన నిరాశపరిచారు అని చాలామంది అన్నారు. అందుకని, మళ్లీ తనను తాను నిరూపించుకోవడం కోసం మంచి ప్రేమకథను సిద్ధం చేస్తున్నారట.
నాగచైతన్య కథానాయకునిగా మోహన కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో ఒక సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. దాని కోసం ఒక సెన్సిబుల్ లవ్ డ్రామాను రెడీ చేస్తున్నారట. అయితే చైతూ నుండి గ్రీన్ సిగ్నల్ రావాల్సి ఉంది. ప్రస్తుతం నాగ చైతన్య శేఖర్ కమ్ముల దర్శకత్వంలో 'లవ్ స్టోరీ' సినిమా చేస్తున్నారు. తర్వాత విక్రమ్ కుమార్ దర్శకత్వంలో 'థాంక్యూ' చేయనున్నారు. అప్పటివరకు ఇంద్రగంటి వెయిట్ చేయాలి. మధ్యలో మరొకరు మంచి కథతో వస్తే నాగచైతన్య ఆల్ సినిమా చేసే అవకాశాలను కొట్టిపారేయలేం.
Also Read