ఇలియానా.. అన్‌ఫెయిర్ అండ్ లవ్లీ!
on Nov 22, 2020
'బర్ఫీ'తో బాలీవుడ్ బాట పట్టింది ఇలియానా. జయాపజయాలతో సంబంధం లేకుండా పలు క్రేజీ ప్రాజెక్ట్‌లలో భాగమైంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. వాటిలో ఒకటి.. 'అన్‌ఫెయిర్ అండ్ లవ్లీ'. ఇందులో రణదీప్ హుడాకి జోడిగా ఇలియానా దర్శనమివ్వనుంది.
ఈ సినిమాతో బల్విందర్ సింగ్ దర్శకుడిగా పరిచయం కానున్నాడు. లాక్డౌన్ తర్వాత మళ్లీ చిత్రీకరణకి శ్రీకారం చుట్టిన యూనిట్.. తాజాగా షూటింగ్ పార్ట్‌ను ఫినిష్ చేసింది.
ఇందులో ఇలియానా ఇదివరకెన్నడూ కనిపించని పాత్రలో దర్శనమివ్వనుంది. వచ్చే ఏడాది థియేటర్స్‌లో సందడి చేయనున్న ఈ సినిమాతో ఇలియానాకి ఎలాంటి గుర్తింపు వస్తుందో చూడాలి.
కాగా, అభిషేక్ బచ్చన్‌తో కలిసి ఇలియానా నటించిన 'ది బిగ్ బుల్' త్వరలోనే డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో రిలీజ్ కానుంది.
Also Read