English | Telugu

`RRR` హీరోల ఇంట్ర‌డ‌క్ష‌న్‌కు ఖ‌ర్చెంతో తెలుసా!!

on Jul 11, 2019


                  
 ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్ హీరోలుగా ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న భారీ మ‌ల్టీస్టార‌ర్ పీరియాడిక్ ఫిలిం `ఆర్ ఆర్ ఆర్`. ఈ చిత్రం ఇప్ప‌టికే రెండు షెడ్యూల్స్ షూటింగ్ పూర్తి చేసుకున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌జంట్ చిన్న విరామం తీసుకున్న ఈ చిత్రం త్వ‌ర‌లో మ‌రో షెడ్యూల్ ప్రారంబించుకోనుంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన న్యూస్ ఒక‌టి సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తోంది. ఒక సారి ఆ వివ‌రాల్లోకి వెళితే...ఖ‌ర్చు విష‌యంలో ఏ మాత్రం కాంప్ర‌మైజ్ కావ‌ట్లేద‌ట చిత్ర యూనిట్. కేవ‌లం హీరోల ఇంట్ర‌డ‌క్ష‌న్ సీన్స్ కోస‌మే దాదాపు 60 కోట్లు ఖ‌ర్చు చేస్తున్నార‌ట ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి. ఇద్ద‌రు హీరోల ఫ్యాన్స్ ఏ మాత్రం హ‌ర్ట్ అవ‌కుండా ఇద్ద‌రి ఇంట్ర‌డ‌క్ష‌న్స్ కూడా ఓ రేంజ్ లో ఉండేలా ప్లాన్ చేసాడ‌ట ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి. ఇక హీరోల ఇంట్ర‌డ‌క్ష‌న్సే ఇలా ఉంటే ఇక క్లైమాక్స్ ఏ రేంజ్ లో ఉంటుందో ఊహించుకోవ‌చ్చు.  డివివి ఎంట‌ర్ టైన్ మెంట్స్ బేన‌ర్ పై దాన‌య్య ఈ సినిమాను ఏ మాత్రం రాజీ ప‌డ‌కుండా ని ర్మిస్తున్నారు. కీర‌వాణి సంగీతం స‌మ‌కూరుస్తోన్న ఈ సినిమాలో బాలీవుడ్ న‌టులు అలియాభ‌ట్ , అజ‌య్ దేవ్ గ‌న్ న‌టిస్తున్నారు.


Also Read



Latest News



Customer Service

Live Help 24/7Customer Care

teluguone.teluguone@gmail.com

Send your Queries to

support@teluguone.com

Follow Us Here