తెలుగు వాళ్ళ మనసు గెలుస్తుందా..
on Sep 14, 2018
నన్ను దోచుకుందువటే అంటూ ఇంకో పది రోజుల్లో థియేటర్స్ లో పలకరించ బోతున్నాడు సుదీర్ బాబు . మొన్ననే సమ్మోహనం అంటూ ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి మంచి మార్క్స్ కొట్టేసాడు. ట్రైలర్ చూసి ఫిలిం లో స్టొరీ తో పాటు ఏదో కొంత కొత్తదనం , మరికొంత కామెడీ కూడా ఉండబోతోంది అన్న అంచనా వేస్తున్నారు సినిమా ప్రేమికులు . ఈ రెండే కాకుండా కుర్ర కారుని ఈ సినిమాకి రప్పించే మరో అంశం కూడా వుంది అంటున్నారు, హీరోయిన్ నభ నటేష్ ని చూసిన వాళ్ళంతా. ఇంజినీరింగ్ చేసి ఇన్ఫోసిస్ లో కొన్నాళ్ళు ఉద్యోగం చేసి ఆ తర్వాత ధియేటర్ ట్రైనింగ్ తీసుకుంది నభ . మిస్ ఇండియా బెంగళూర్ లో పదకొండో స్థానం దక్కించుకుంది కూడా. రవీంద్రనాథ్ టాగోర్ గోరా ని శాంతినికేతన్ లో ప్రదర్సిన్చినప్పుడు అందులో ఒక ముఖ్య పాత్ర పోషించింది .
మూడేళ్ళ క్రితం ఒక కన్నడ సినిమాతో సినీ ప్రయాణం మొదలు పెట్టింది . ఆ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వటమే కాదు నభ ఈ సినిమా కి గాను కన్నడ నుంచి బెస్ట్ ఎక్ట్రాస్ గ ఫిలిం ఫేర్ కి నామినేట్ అయ్యింది కూడా. ఇప్పుడు తెలుగు లో అదిగో ఫిలిం పోస్ట్ ప్రొడక్షన్ లో వుంది . నన్ను దోచుకుందువటే ఇంకో పది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది . నటన లో తనకి తిరుగు లేదు అన్నది ఆల్రెడీ వేరే భాషా సినిమాలతో ప్రూవ్ అయిపొయింది . ఇక అందం అంటారా చూస్తేనే తెలిసిపోతోంది.. చక్కని చుక్క అని . మరి తెలుగు ప్రేక్షకులకి ఎంతవరకు ఈ నభ నచ్చుతుందో అన్నదాని బట్టి తెలుగు లో తన ప్రయాణం ఆధార పది వుంటుంది . ఇదిగో ఆ చక్కని చుక్క చక్కటి ఫొటోస్ కొన్ని చూడండి....