'అర్జున్‌రెడ్డి' హీరోయిన్... 'ఎదురీత'లో స్టూడెంట్!
on Feb 11, 2019
'అర్జున్‌రెడ్డి'లో హీరోయిన్ షాలిని పాండే. ఇప్పుడు చెప్పేది ఆమె గురించి కాదు. సెకండ్ హీరోయిన్ జియా శర్మ గురించి. సినిమాలోనూ హీరోయిన్గా కనిపించారామె. సినిమాలో ఓ హీరోయిన్‌కి గాయమైతే... విజయ్ దేవరకొండ ట్రీట్మెంట్ చేయడానికి వెళతాడు. గుర్తుందా? ఆ హీరోయినే ఈ హీరోయిన్. 'అర్జున్ రెడ్డి' విడుదలైన చాలా రోజుల తరవాత మరో తెలుగు సినిమాలో జియా శర్మ నటించారు. పలు తెలుగు సినిమాల్లో విలన్స్ పక్కన కీలక పాత్రల్లో నటించిన శ్రవణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా 'ఎదురీత'. తండ్రీ కొడుకుల మధ్య అనుబంధం నేపథ్యంలో రూపొందుతోంది సినిమా. ఇందులో జియా శర్మ నటిస్తున్నారు. 'అర్జున్ రెడ్డి'లో హీరోయిన్ క్యారెక్టర్లో కనిపించిన జియా శర్మ.. 'ఎదురీత'లో స్టూడెంట్ క్యారెక్టర్లో కనిపించనున్నారు. తెలుగులో అవకాశాలు వస్తుండటంతో తెలుగు నేర్చుకునే ప్రయత్నాల్లో ఉన్నానని తెలిపారామె.