హీరో విశాల్ ఎంత పని చేశాడో తెలుసా..?
on May 16, 2016
తెలుగు వాడైనా తమిళంలో స్థిరపడి అక్కడ స్టార్ స్టేటస్ తెచ్చుకున్నాడు విశాల్. కమర్షియల్ హీరోగానే కాక, పెర్ఫామెన్స్ లో కూడా మంచి నటుడని పేరు సంపాదించాడు. యాక్టింగ్ పరంగా విశాల్ కు పేరు తీసుకొచ్చిన సినిమా వాడు వీడు. సినిమా అంతా నిజంగానే మెల్లకన్నుతో నటించడం విశాల్ చేసిన సాహసమనే చెప్పాలి. అయితే ఇలా నటించడం కోసం విశాల్ తెర వెనుక ఎంత కష్టపడ్డాడో తెలుసా..? తెలిస్తే ఆశ్చర్యం వేయక మానదు. రీసెంట్ గా ఒక ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో విశాల్ తాను ఎంత కష్టం అనుభవించిందీ చెప్పాడు. ఇంతకంటే ఎక్కువ కష్టపడితే ఇక చనిపోవడమే అన్నంత పాయింట్ వరకూ విశాల్ తన శరీరాన్ని కష్టపెట్టాడట. " 230 రోజులపాటు జరిగిన ఆ సినిమాకు స్క్రిప్ట్ లో మెల్లకన్నుతో యాక్ట్ చేయాలని లేదు. కానీ మొదటి రోజు షూటింగ్ పూర్తవ్వగానే, దర్శకుడు బాల నన్ను పిలిచి మెల్లకన్నుతో చేస్తేనే పాత్ర బాగా పండుతుంది అని చెప్పారు. ఆరోజుకు ఎలాగోలా మెల్లకన్నుతో నటించేశాను. అయితే ఆ తర్వాత మాత్రం, కృత్రిమంగా అలా చేయడం కుదురుతుందేమోనని చెన్నైలోని డాక్టర్లను సంప్రదించాను. కానీ వాళ్లందరూ కూడా అది అసాధ్యం అన్నారు. దీంతో రోజూ మెల్లకన్నుతో ప్రాక్టీస్ చేశాను. అలా ఉండటం వలన వాంతులతో పాటు తలపోటు విపరీతంగా వచ్చేది. ఆఖరికి ఇంట్లో కూడా మెల్ల కన్ను పెట్టడంతో, అమ్మ భయపడిపోయింది. కానీ ఈ విషయాన్ని ఏరోజూ బాలా గారికి చెప్పలేదు. అయితే ఆ సైడ్ ఎఫెక్ట్స్ తట్టుకోలేక, షూటింగ్ జరిగినన్నాళ్లూ ఆల్కహాల్ మాత్రం తీసుకున్నాను. మళ్లీ ఆ మందు అలవాటు నుంచి బయటకు రావడం కోసం హిమాలయాలకు వెళ్లాల్సి వచ్చింది " అంటూ ఆ సినిమా కోసం తాను పడిన కష్టాన్ని చెప్పుకొచ్చాడు విశాల్. ఒక పాత్రకోసం ఇంత కష్టపడటం నిజంగానే గ్రేట్..కాదనగలమా..?
Also Read