నచ్చకపోతే రిజక్ట్ చెయ్యమంటున్న సూర్య..!
on Apr 11, 2016
హీరో సూర్య నటించిన 24 సినిమాకు తమిళ ఆడియో ఫంక్షన్ ఈరోజు చెన్నై లో సత్యం థియేటర్స్ లో జరిగింది. సినిమాకు సంబంధించిన టీం అంతా ఈ ఫంక్షన్ కు అటెండ్ అయ్యారు. కేవలం ఫ్యాన్స్ వల్లనే తాను ఆ స్టేజ్ మీద ఉన్నానని, వాళ్లు లేకపోతే తాను లేనని సూర్య చెప్పుకొచ్చాడు. సూర్య స్పీచ్ ఆయన మాటల్లోనే.." మీరు నా ఫ్యాన్స్ అయినంత మాత్రాన నా ప్రతీ సినిమానూ చూడాలని లేదు. నేను చేసిన ఏ సినిమా ఐనా మీకు నచ్చకపోతే వెంటనే రిజక్ట్ చేసేయండి. అలా అయితేనే మీకోసం నేను మంచి స్క్రిప్టులు, మంచి టీం తో సినిమాలు తీస్తాను. నేను మిమ్మల్ని కలిసి మూడు నాలుగేళ్లు అవుతున్నా మీరు మాత్రం, నా ఆడియో ఫంక్షన్ అనగానే ఎక్కడెక్కడి నుంచో నాకోసం వచ్చారు. మీ అందరికీ ఎన్నిసార్లు కృతజ్ఞతలు చెప్పినా తక్కువే. ఈ సినిమా కథ నచ్చి, ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్న ఏఆర్ రెహమాన్ గారికి కూడా నా ధన్యవాదాలు. ఆయనతో పోల్చుకుంటే, మేమెవ్వరం ఏమీ సాధించలేదు. ఎంత సాధించినా, అందర్నీ తనతో సమానంగా చూడటం ఆయనకే చెల్లింది. సినిమాకు పనిచేసిన మిగిలిన టెక్నీషియన్లందరికీ కూడా కృతజ్ఞతలు" అంటూ తన స్పీచ్ ను ముగించాడు సూర్య. ఈరోజు సాయంత్రం శిల్పకళావేదికలో తెలుగు ఆడియో రిలీజ్ చేయబోతున్నారు.