బుద్ధి ఉన్నోడెవడైనా అలా అంటాడా?
on Jan 3, 2018
స్యయంకృతాపరాధాలు మనిషిని దెబ్బతీస్తాయ్. అందుకే.. నిర్ణయాలు ఆచి తూచి తీసుకోవాలంటారు పెద్దలు. సునీల్ జీవితాన్నే తీసుకోండి... తన దగ్గరకు వచ్చిన మంచి మంచి కథల్ని వెనక్కుపంపుకని ఇప్పుడు పరాజయాల ఊబిలో ఇరుక్కుపోయాడు సునీల్. దీని బట్టి అర్థమైందేంటి? నిర్ణయాలు సరైనవి అయితే... విజయం తథ్యం. ఈ విషయాన్ని సునీలే స్వయంగా అంగీకరించాడు. ఈ మధ్య ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తన తప్పుల్ని నెమరువేసుకున్నాడు. తన దర్గరకు వచ్చిన ‘పటాస్’ కథను వెనక్కు పంపి చాలా తప్పు చేశానని ఆవేదన వ్యక్తం చేశాడు సునీల్. ‘ఖైదీ నంబర్ 150’ వదులుకున్న మాట నిజమే. అందులో అలీ చేసిన పాత్ర మొదట్లో నాదే. అయితే... ‘ఈడు గోల్డెహ’ డేట్స్.. ఆ సినిమా డేట్స్ రెండు క్లాష్ అవ్వడంతో.. అన్నయ్య సినిమాను వదులుకోక తప్పలేదు. ఈ విషయం అన్నయ్యకు చెబితే.. ఆయన కూడా ‘కేరియాన్’ అన్నారు. లేకపోతే.. అన్నయ్యతో చేసే అవకాశాన్ని అంత తేలిగ్గా వదులుకుంటానా? ఈ మీడియా వాళ్లేమో... దానికి ఏదేదో రాసేశారు. నేను హీరోగా చేస్తున్నాను కాబట్టి... ఆ బలుపుతో మెగా ఆఫర్ ని పక్కన పెట్టానని రాశారు. నిజంగా నాకు తెలుసు.. అన్నయ్యకు తెలుసు. సో... బాధ పడాల్సిన అవసరం లేదు. ‘సైరా నరసింహారెడ్డి’లో కేరక్టర్ చేస్తానని నాకు నేనుగా అన్నయ్యను అడిగాను. అన్నయ్య వెంటనే అంగీకరించారు’ అని చెప్పుకొచ్చాడు సునీల్.
దర్శకుడు మారుతీ ఈ మధ్య నా గురించి ఏదేదో మాట్లాడాడు. మీడియాలో అది చూశాక షాక్ అయ్యాను. నాకు తను ‘భలే భలే మగాడివోయ్’ కథ చెబితే.. నేను దాన్ని ‘ఒక్కడు’ తరహాలో మార్చమన్నట్టు ఆయన చెప్పాడు. ఎందుకాయన అంత అబద్ధమాడాడో నాకు అర్థం కాలేదు. ఒకవేళ ఎవరో అంటే.. పొరపాటున నా పేరును చెప్పాడా? అనేది కూడా నాకు అర్థం కాని పరిస్థితి. మారుతికీ నాకు మధ్య కథా చర్చలు జరిగిన మాట నిజం. తనో కథ చెప్పాడు. నాకు నచ్చలేదు. రెండో కథ చెప్పాడు. అది కూడా నచ్చలేదు. చివరకు ‘భలే భలే మగాడివోయ్’ పాయింట్ మాత్రం చెప్పాడు. బావుంది. చేద్దాం అన్నాను. ఎందుకో ఆ తర్వాత ఆయన నాతో కలవలేదు. నానితో చేసేశారు. దానికి నేను బాధ పడలేదు. కానీ... ఈ విషయంలో నన్నెందుకు అనవసరంగా మారుతీ టార్గెట్ చేశాడో నాకర్థం కాలేదు. ‘భలే భలే మగాడివోయ్’ మెమరీలాస్ నేపథ్యంలో సాగే కథ. బుద్ధున్నోడెవడైనా.. దాన్ని ‘ఒక్కడు’ తరహాలో మార్చమంటాడా? నాకు బుద్ధి లేదనుకుంటున్నాడా? మరి ఇంత అబద్ధం ఆడాల్సిన అవసరం మారుతికి ఏమొచ్చిందో అర్థం కావడంలేదు’ అంటూ ఓ స్థాయిలో మండిపడ్డాడు సునీల్. మరి మారుతికి అలా చెప్పాల్సిన అవసరం ఏమొచ్చిందో... దేవుడికే తెలియాలి.