English | Telugu

వినోద‌మే త‌ప్ప వివాద‌మే ఎరుగ‌ని హీరో!!

on Mar 23, 2019

 

శ‌తాధిక చిత్రాల హీరోగా, శ‌త దినోత్స‌వాలు జ‌రుపుకున్న చిత్రాల హీరోగా టాలీవుడ్ లో `గుడ్ ప‌ర్స‌న్` గా పేరు తెచ్చుకున్నాడు శ్రీకాంత్. సినిమా ఫీల్డ్ లో ఎటువంటి స‌పోర్ట్ లేకుండా స్వ‌యంకృషితో ఎదిగిన హీరో.  క‌ష్టం విలువ తెలిసిన వ్వ‌క్తి కాబ‌ట్టి ఎవ‌ర్నీ క‌ష్ట‌పెట్ట‌డు.  ఎప్పుడూ మ‌న‌స్ఫూర్తిగా  న‌వ్వుతూ పాజిటివ్ థింకింగ్ తో ఉంటాడీ హీరో. అదే త‌న గ్లామ‌ర్ తో పాటు స‌క్సెస్ సీక్రేట్ అని చెబుతుంటాడు. వివాదాల‌కు దూరంగా ఉంటూ `వినోదం` పంచే ఈ హీరో అంద‌రికీ ఆమోద‌యెగ్య‌మైన ఎన్నో సినిమాల్లో న‌టించాడు, న‌టిస్తున్నాడు. తొలి నాళ్ల‌లో విల‌న్ గా చేసి ఆ త‌ర్వాత హీరోగా మారి కుటుంబ క‌థా చిత్రాల హీరోగా పేరు తెచ్చుకున్నాడు. ఏ పాత్ర చేసినా, ఆ పాత్ర‌లో త‌న మార్క్ చూపిస్తూ ... న‌టుడుగా మంచి మార్కులు కొట్టేస్తుంటాడు.

`తాజ్ మ‌హ‌ల్ , ఎగిరే పావుర‌మా, వినోదం, ప్రేయ‌సి రావే, ఆహ్వానం,  ఆమె, తాళి, పెళ్లి  సంద‌డి చిత్రాలతో సంద‌డి చేసాడు. ఇలా చెప్పుకుంటూ పోతే శ్రీకాంత్  కెరీర్ కు మైలు రాయిలా నిలిచే చిత్రాలు చాలానే ఉన్నాయి.  ఇవ‌న్నీ ఒక ఎత్తైతే క్రియేటివ్ డైర‌క్ట‌ర్ కృష్ణ వంశీ డైర‌క్ష‌న్ లో వ‌చ్చిన ఖ‌డ్గం ఒక ఎత్తు. ఆ సినిమాలో  శ్రీకాంత్  సీరియ‌స్ అండ్ సిన్సియ‌ర్ పోలీస్ ఆఫీస‌రగా న‌టించి, త‌న‌లో ఈ యాంగిల్ కూడా ఉందా? అనిపించుకున్నాడు. అంద‌రిచేత ప్ర‌శంస‌లు పొందాడు. ఆ త‌ర్వాత పోసాని కృష్ణ మ‌రుళి ద‌ర్శ‌క‌త్వంలో ` ఆప‌రేష‌న్ దుర్యోధ‌న‌` చిత్రంలో న‌టించి న‌టుడుగా త‌న‌లోని మ‌రో కోణాన్ని చూపించాడు శ్రీకాంత్. ఇక వందో చిత్రం `మ‌హాత్మ‌` ప‌ట్టుబ‌ట్టి కృష్ణ వంశీ ద‌ర్శ‌క‌త్వంలో చేశాడు. క‌మ‌ర్షియ‌ల్ గా అది వ‌ర్క‌వుట్ కాక‌పోయినా కూడా న‌టుడుగా శ్రీకాంత్ ని వంద మెట్లు ఎక్కించింది.  ఆ త‌ర్వాత చేసిన సినిమాలు ఏవీ పెద్ద‌గా వ‌ర్క‌వుట్ కాలేదు. ఒక వైపు హీరోగా చేస్తూనే కొన్ని సినిమాల్లో కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తూ వ‌స్తున్నాడు.  ప్ర‌జంట్ త‌న‌యుడు రోష‌న్ ను ఒక మంచి హీరోగా టాలీవుడ్ లో నిల‌బెట్టాల‌న్న ప్ర‌య‌త్నంలో ఉన్నాడు.  జ‌యాప‌జ‌యాల‌ను ప‌ట్టించుకోకుండా సిన్సియ‌ర్ గా  త‌న ఎఫ‌ర్ట్ పెడుతూ , డెడికేష‌న్ తో ప‌ని చేసే వ్య‌క్తి.  ఎప్పుడూ  చెర‌గ‌ని చిరున‌వ్వుతో  , చెద‌ర‌ని ఆత్మ‌విశ్వాసంతో ఉంటూ టాలీవుడ్ క్లీన్ హీరోగా పేరు తెచ్చుకుని  హ్యాపీ లైఫ్ ని లీడ్ చేస్తోన్న శ్రీకాంత్ పుట్టిన రోజు (మార్చి 23) సంద‌ర్భంగా ఆయ‌న‌కు పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తోంది `తెలుగువ‌న్‌`.


Also ReadLatest NewsCustomer Service

Live Help 24/7Customer Care

teluguone.teluguone@gmail.com

Send your Queries to

support@teluguone.com

Follow Us Here