నాని, ఏంటి ఇలా జరిగింది?
on Dec 23, 2017
సరయిన కథలు ఎన్నుకోవడంలో దిట్ట, సక్సెస్ కి మారుపేరు, మధ్య తరగతి సినిమాలకి సూపర్ స్టార్... ఇవి మొన్నటి వరకు నాని గురించి ప్రస్తావన వచ్చిన ప్రతిసారి వాడిన పదాలు. కానీ, మిడిల్ క్లాస్ అబ్బాయి విడుదలతో ఇప్పుడు లెక్కలు, విశ్లేషణలు మారాయి. శ్రీరామ్ వేణు దర్శకత్వంలో వచ్చిన ఎం.సి.ఏ. నాని కెరీర్ లోనే బిగ్గెస్ట్ ప్లాప్ అంటున్నారు ట్రేడ్ పండితులు. ఓపెనింగ్స్ కూడా కరువయిన ఈ సినిమా, నిర్మాతలు, బయ్యర్లకు పెద్ద మొత్తంలో నష్టాలు చేకూరుస్తుందని అంటున్నారు. డివైడ్ టాక్ వచ్చిన నాని సినిమాలు కొన్ని గట్టెక్కిన సందర్భాలు ఉన్నాయి. బట్, మిడిల్ క్లాస్ అబ్బాయి అబ్బాయి విషయంలో ఇది అసాధ్యం గా కనిపిస్తుంది. ఈ సినిమా లో నాని నుండి ఆశించే అంశాలేవీ లేకపోవడంతో క్రిటిక్స్ మరియు జనరల్ ఆడియన్స్ పెదవి విరిచారు. మూల కథ కాస్త ఇంటరెస్టింగ్ గా అనిపించినా, కథనం, దర్శకత్వం లో సత్తా లేకపోవడంతో మొదటి రోజు నుండే ప్రేక్షకులు థియేటర్లకు రావడం మానేశారు. ఓవర్సీస్ లో నాని కి మంచి క్రేజ్ ఉంది. కానీ, ఎం.సి.ఏ. అక్కడి డిస్ట్రిబ్యూటర్ల పాలిట శాపంగా మారింది. ఇక నయినా, నాని ఇలాంటి తప్పులు చేయకుండా, కథలు ఎన్నుకునే విషయంలో కాస్త జాగర్తపడాలి అంటున్నారు విశ్లేషకులు.