'ఎబిసిడి'కి నాని కామెంట్ ప్లస్సా? మైనస్సా?
on May 14, 2019
అల్లు శిరీష్ హీరోగా నటించిన 'ఎబిసిడి' ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కి నాని ముఖ్య అతిథిగా వచ్చాడు. సాధారణంగా అతిథిగా వచ్చినవాళ్లు సినిమా గురించి నాలుగు మంచి ముక్కలు మాట్లాడతారు. సినిమాకు ప్లస్ అయ్యేలా! 'ఎబిసిడి' ఫంక్షన్లో నాని స్పీచ్ స్టార్టింగ్ గమనిస్తే.... 'ఎబిసిడి'ని తిట్టాడో? పొగిడాడో? అర్థం కాదు. "ఈ సినిమా ట్రైలర్ 'పిల్ల జమిందార్' గుర్తొచ్చింది. ఇక్కడ 'పిల్ల జమిందార్' ఇష్టమైనవాళ్లు ఎవరైనా ఉన్నారా? ఇప్పటికే నేను ఎక్కడికి వెళ్లినా 'పిల్ల జమిందార్'పై ప్రేక్షకులు చాలా ప్రేమ చూపిస్తారు. ఆ చిత్రాన్ని మించి 'ఎబిసిడి'కి పేరు రావాలని కోరుకుంటున్నా" అని నాని అన్నాడు. 'ఎబిసిడి' ట్రైలర్ విడుదలైన తరవాత 'పిల్ల జమిందార్' ఛాయలు కనపడుతున్నాయని తెలుగువన్ చెప్పింది. ఇంచు మించు నాని అలాగే మాట్లాడాడు. ఆల్రెడీ విడుదలైన సినిమాతో విడుదల కానున్న సినిమాను పోల్చడం, విడుదలయ్యే సినిమాకు ప్లస్సో మైనస్సో నానికే తెలియాలి. ఆయన మాటలు విన్నాకా... 'పిల్ల జమిందార్' కంటే 'ఎబిసిడి' పెద్ద హిట్ కావాలని కోరుకున్నారో? 'పిల్ల జమిందార్'లా 'ఎబిసిడి' ఉందని చెప్పారో? అర్థం కాలేదు ప్రేక్షకులకు.
Also Read