English | Telugu

వామ్మో... 24 ముద్దులే!

on Jan 11, 2018

ఒకే సినిమాలో ఒకే హీరోయిన్ 24 ముద్దులివ్వడం అంటే అది మామూలు విషయం కాదు. ఆ సాహసమే చేస్తోంది... హెబ్బా పటేల్. తన సాహసంతో... కుర్రకారుని ‘అబ్బా’.. అనిపించే పనిలో పడింది హెబ్బా. ఇంతకీ ఈ సాహసం హెబ్బా పటేల్ ఏ సినిమాలో చేస్తోందో చెప్పనేలేదు కదూ.. సినిమా పేరు ‘శ్రీ లక్ష్మీ అండ్ 24 కిసెస్’. 

‘మిణుగురులు’ లాంటి మంచి సందేశాత్మక చిత్రాన్ని తెరకెక్కించిన అయోధ్యకుమార్ ఈ చిత్రానికి దర్శకుడు. చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి హీరోగా ఎదిగిన తేజ సజ్జా ఇందులో హెబ్బా సరసన హీరోగా నటిస్తున్నాడు. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కనుంది. తనకు ‘కుమారి 21 ఎఫ్’ చిత్రం ఎంత  పేరు తెచ్చిపెట్టిందో... మళ్లీ అంత పేరును ‘శ్రీ లక్ష్మీ అండ్ 24 కిసెస్’ చిత్రం తెచ్చిపెడుతుందని హెబ్బా పటేల్ నమ్మకం వ్యక్తం చేస్తోంది. కథ రిత్యా ఇందులో హెబ్బాది బోల్డ్ కేరక్టర్ అట. పేరుకు తగ్గట్టే 24 ముద్దులు పెట్టాల్సొచ్చే పాత్రట. అంతేకాదు.. అభినయానికి కూడా ఆస్కారమున్న పాత్ర అని హెబ్బా చెబుతోంది. 

ఇప్పటివరకూ హెబ్బా పటేల్ కెరీర్ లో రెండే హిట్లు. అందులో ఒకటి ‘కుమారి 21 ఎఫ్’ కాగా, రెండోది ‘ఎక్కడికీ పోతావు చిన్నవాడా’. మధ్యలో కొన్ని సినిమాలు చేసినా.. అవేమీ పెద్దగా ఆడలేదు. అయితే... ‘శ్రీ లక్ష్మీ అండ్ 24’ చిత్రం మళ్లీ తనకు మంచి హిట్ అవుతుందని హెబ్బా పటేల్ నమ్మకం వ్యక్తం చేస్తోంది. 
తన నమ్మకం నిజం కావాలని మనం కూడా ఆశిద్దాం.
 


Also Read



Latest News



Customer Service

Live Help 24/7Customer Care

teluguone.teluguone@gmail.com

Send your Queries to

support@teluguone.com

Follow Us Here