చిరు, బాలయ్యలను ఢీకొట్టిన రామోజీరావు
on Jan 10, 2017
పీపుల్స్‌స్టార్ ఆర్.నారాయణమూర్తి నటించిన హెడ్‌కానిస్టేబుల్ వెంకట్రామయ్య మూవీని సంక్రాంతికి విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. అయితే ఈ సినిమాకు థియేటర్ల సమస్య పెద్ద అడ్డంకిగా మారింది..కారణం మెగాస్టార్ ఖైదీ నెం.150, బాలయ్య గౌతమీపుత్ర శాతకర్ణి, శర్వానంద్ శతమానం భవతి లాంటి పెద్ద సినిమాలు సంక్రాంతికే విడుదలవుతుండటంతో మూర్తి సినిమాకు థియేటర్లు దొరకడం కష్టమైంది. కనీసం ఊరికి ఒక ధియేటరైనా ఇవ్వడంటూ పీపుల్స్ స్టార్ బహిరంగంగా వేడుకున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతుంది.
అయితే ఆయన ఆవేదనను అర్థం చేసుకున్న ఓ పెద్దాయన క్షణాల్లో సమస్యను తీర్చేశారు. ఆయన ఎవరో కాదు మీడియా మొఘల్ రామోజీరావు. విషయం తెలుసుకున్న రామోజీ తన మయూరి ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా రెండు రాష్ట్రాల్లో 100కు పైగా థియేటర్లు కట్టబెట్టారు. పెద్దాయన చొరవతో నారాయణమూర్తికి కష్టాలు తొలగిపోయినట్లే..అన్నట్లు జనవరి 14న హెడ్‌కానిస్టేబుల్ వెంకట్రామయ్య రిలీజ్ కానుంది.