వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసిన మహేశ్ బర్త్‌డే హ్యాష్‌టాగ్
on Aug 9, 2020
2020 ఆగస్ట్ 9 సూపర్‌స్టార్ మహేశ్ బర్త్‌డేని మరపురానిదిగా మార్చేశారు ఆయన ఫ్యాన్స్. సోషల్ మీడియాలో ఆయనకు సంబంధించిన పేజీలు వైరల్ అవడంలో ప్రధాన భూమిక పోషించారు. ఫిల్మ్ సెలబ్రిటీలు ఎంతోమంది ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. అయితే కరోనా వ్యాప్తి కారణంగా బర్త్‌డే సెలబ్రేషన్స్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్న మహేశ్, తన ఫ్యాన్స్‌ను కూడా అదేవిధంగా ఉండమని కోరాడు. తన ఫ్యామిలీతో గడిపిన ఆయన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా తన ఇంటి ఆవరణలో మొక్క నాటాడు.
కాగా ఆయన బర్త్‌డే ట్రెండ్ వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసి, ఇప్పటిదాకా ఉన్న అన్ని రికార్డులను బద్దలు కొట్టేసింది. మహేశ్‌కు ఈ బర్త్‌డే మరపురానిదిగా చేసి, వరల్డ్ రికార్డును ఆయనకు కానుకగా అందజేశారు ఫ్యాన్స్. వాళ్లు క్రియేట్ చేసిన #HBDMaheshBabu హ్యాష్‌ట్యాగ్ 24 గంటల్లో 60.2 మిలియన్ ట్వీట్స్‌ను నమోదు చేసి, అన్ని రికార్డులను బ్రేక్ చేసింది. ఇంతదాకా ట్విట్టర్ వేదికపై వరల్డ్‌లోనే బిగ్గెస్ట్ ట్రెండ్‌గా ఇది నిలిచింది. ఈ ట్రెండ్‌లో 1.28 లక్షల మందికి పైగా పాల్గొనడం కూడా కొత్త రికార్డే.
మహేశ్ తదుపరి సినిమా సర్కారు వారి పాట మోషన్ పోస్టర్ ఇదే సందర్భంలో రిలీజ్ చేయడంతో ఫ్యాన్స్ మరింతగా సంబరాలు చేసుకున్నారు. దానికి కూడా ఊహించిన రెస్పాన్స్ వచ్చింది. కరోనా వైరస్ బలహీనపడిన తర్వాతే షూటింగ్ సెట్స్ మీదకు రావాలని మహేశ్ నిర్ణయించుకున్నాడు. పరశురామ్ డైరెక్ట్ చేయనున్న ఈ మూవీకి తమన్ స్వరాలు కూరుస్తున్నాడు.
Also Read