నువ్వింకా 'సోలో'వే కాబట్టి రెచ్చిపో.. సాయితేజ్‌కు మెగాస్టార్ బర్త్‌డే విషెస్
on Oct 15, 2020
అక్టోబర్ 15 సాయిధరమ్ తేజ్ బర్త్‌డే. ఈ సందర్భంగా అతని లేటెస్ట్ ఫిల్మ్ 'సోలో బ్రతుకే సో బెటర్'లో "ఒగ్గేసి పోకే అమృతా" అనే సాంగ్‌ను తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా మెగాస్టార్ చిరంజీవి లాంచ్ చేశారు. దాంతో పాటు 'సోలో' అయిన మేనల్లుడికి క్యూట్ బర్త్‌డే విషెస్ తెలియజేశారు. "హ్యాపీ బర్త్‌డే డియర్ సాయితేజ్. నువ్వింకా 'సోలో'వే కాబట్టి రెచ్చిపో. నీ సోలో రోజులు ఏమైనప్పటికీ లెక్కించబడతాయి. వెలుగు ఉన్నప్పుడే హౌస్‌పార్టీ చేసుకో." అని అందమైన, హషారు రేకెత్తించే శుభాకాంక్షలు అందజేశారు చిరంజీవి. బహుశా తన సోలో రోజులను ఆయన గుర్తు చేసుకుని ఉంటారు.
మేనమామ అందజేసిన శుభాకాంక్షలు, ఆశీర్వాదాలకు పొంగిపోయిన మేనల్లుడు సాయితేజ్ కూడా వెంటనే స్పందించాడు. "ఎవరైనా అడిగే బెస్ట్ బర్త్‌డే గిఫ్ట్ ఇదే.. దీన్ని మరింత స్పెషల్‌గా మార్చిన మీకు థాంక్యూ సో మచ్ మామా. లవ్ యూ సో మచ్.. మీ బ్లెస్సింగ్స్ కంటే మించి ఇంకేమి అడగగలను. థాంక్యూ సో మచ్ మామా" అని రిప్లై ఇచ్చాడు.
తమన్ సంగీతం సమకూర్చిన "ఒగ్గేసి పోకే అమృతా" పాటను కాసర్ల శ్యామ్ రాయగా నకష్ అజీజ్ పాడాడు. సాయితేజ్ జోడీగా ఈ మూవీలో నభా నటేష్ నటిస్తోంది. డెబ్యూ డైరెక్టర్ సుబ్బు రూపొందిస్తోన్న 'సోలో బ్రతుకే సో బెటర్' మూవీని బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు.