క్రాక్తో హ్యాట్రిక్ కొట్టిన టెక్నీషియన్
on Jan 15, 2021
క్రాక్.. ఈ సంక్రాంతి సీజన్ విన్నర్. ఈ ఏడాదిలో తొలి బ్లాక్ బస్టర్. మాస్ మహారాజా రవితేజని, టాలెంటెడ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేనిని మళ్ళీ సక్సెస్ ట్రాక్ లోకి తెచ్చిన చిత్రం. శ్రుతి హాసన్ రి-ఎంట్రీ మూవీ. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ తమన్ క్రేజ్ ని మాస్ ఆడియన్స్ లో మరింత పెంచిన బొమ్మ. అంతేకాదు.. ఓ టెక్నీషియన్ కి హ్యాట్రిక్ ని అందించిన మూవీ కూడా.
ఇంతకీ అతనెవరంటే.. ఈ సినిమాని తన విజువల్స్ తో నెక్స్ట్ లెవల్ కి తీసుకెళ్ళిన ఛాయాగ్రాహకుడు జి. కె. విష్ణు. ఈ సూపర్ టాలెంటెడ్ కెమెరామెన్ కి తెలుగులో ఇదే తొలి చిత్రం. అయితే తమిళంలో మాత్రం మెర్సల్, బిగిల్ చేశాడు. తమిళంలో ఈ రెండు సినిమాలు కూడా సెన్సేషన్ క్రియేట్ చేశాయి. తెలుగులో అదిరింది, విజిల్ పేర్లతో అనువాదమయ్యాయి. రెండు తమిళ చిత్రాలతో బ్లాక్ బస్టర్స్ అందుకున్న విష్ణు.. క్రాక్ తో హ్యాట్రిక్ అంకాన్ని పూర్తిచేసుకున్నాడు.
క్రాక్ విజయంతో విష్ణు ఖాతాలో మరిన్ని క్రేజీ ప్రాజెక్ట్స్ చేరుతున్నాయని టాక్. త్వరలోనే విష్ణు నెక్స్ట్ తెలుగు ప్రాజెక్ట్ పై క్లారిటీ వస్తుంది.