English | Telugu

హరీషూ...రీమేక్‌కి రెడీయా?

on Nov 5, 2018


కథల కోసం హరీష్ శంకర్ కుస్తీ పడుతున్నట్టుంది పరిస్థితి. స్వతహాగా చక్కటి రచయిత అయిన ఈ 'గబ్బర్ సింగ్' దర్శకుడు.. కథల కోసం తమిళ ఇండస్ట్రీపై కన్నేశాడని కృష్ణానగర్ ఖబర్! హరీష్ శంకర్ కెరీర్‌లో 'గబ్బర్ సింగ్' భారీ హిట్. ఆ స్థాయి విజయం అందుకోవడానికి అతడు చేసిన ప్రయత్నాలు ఏవీ ఫలించలేదు సరికదా... ప్రస్తుతం సొంత కథతో హీరోలను మెప్పించడానికి మూడు చెరువుల నీళ్లు తాగుతున్నాడని ఇండస్ట్రీ గుసగుస. 'దువ్వాడ జగన్నాథమ్' తరవాత దిల్ రాజు  కాంపౌండ్‌లో కొన్ని నెలలు కూర్చుని 'దాగుడు మూతలు' అని హరీష్ శంకర్ ఒక మల్టీస్టారర్ కథ రెడీ చేశాడు. దిల్ రాజుకు నచ్చకపోవడంతో ఆ కథను పక్కన పెట్టారు. అక్కడి నుంచి 14 రీల్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌కు వెళ్లాడని, అందులో హరీష్ శంకర్ సినిమా చేస్తారని వార్తలు వినిపించారు. తరవాత దిల్ రాజు నిర్మాణంలో తమిళ హిట్ '96'ని రీమేక్ చేస్తారని ఫిలింనగర్‌లో ఒక వార్త చక్కర్లు కొట్టింది. అందులో వాస్తవం లేదని దిల్ రాజు సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ క్లారిటీ ఇచ్చింది. లేటెస్ట్ టాక్ ఏంటంటే... 2014లో విడుదలైన తమిళ సినిమా 'జిగర్తాండ'ను తెలుగులో రీమేక్ చేయడానికి హరీష్ శంకర్ రెడీ అవుతున్నార్ట‌. తమిళంలో సిద్ధార్థ్ హీరోగా నటించారు. తెలుగులో శర్వానంద్ చేస్తాడని అంటున్నారు. ఇందులో నిజమెంతో తెలియాలంటే హరీష్ శంకర్ క్లారిటీ ఇవ్వాల్సిందే. అయితే ఇక్కడ ఒక్క విషయం చెప్పుకోవాలి... హిందీ సినిమా 'దబాంగ్'ను తెలుగులో యధాతథంగా తీయకుండా, బోల్డన్ని మార్పులు చేశారు హరీష్ శంకర్. ఒకవేళ 'జిగర్తాండ'ను రీమేక్ చేస్తే.. తెలుగు నేటివిటీకి తగ్గట్టు మార్పులు చేయడమా ఖాయం!


Also Read



Latest News



Customer Service

Live Help 24/7Customer Care

teluguone.teluguone@gmail.com

Send your Queries to

support@teluguone.com

Follow Us Here