గాఢంగా ప్రేమించినా నీలమ్‌ను పెళ్లాడలేకపోయిన గోవిందా!
on Nov 25, 2020
ఒకప్పుడు బాలీవుడ్లో తన కామిక్ టైమింగ్‌తో, గ్రేస్‌ఫుల్ డాన్స్‌తో ఆడియెన్స్‌ను అలరించాడు గోవిందా. ఆయన లిస్ట్‌లో అనేక బ్లాక్‌బస్టర్ మూవీస్ ఉన్నాయి. వృత్తిపరంగా ఎన్నో విజయాలు సాధించిన ఆయన వ్యక్తిగత జీవితం గురించి చాలా మందికి తెలీదు. ఒకప్పుడు తనతో పలు సినిమాల్లో హీరోయిన్గా నటించిన నీలమ్‌ను పెళ్లి చేసుకోవాలని ఆయన తలచాడు. ఆమెను గాఢంగా ప్రేమించాడు. కానీ అది వన్ సైడెడ్ లవ్‌గానే మిగిలింది. చివరకు ఆయన తన చిన్ననాటి స్నేహితురాలు సునీతను 1987 మార్చి 11న పెళ్లి చేసుకున్నాడు.
'ఇల్జామ్' మూవీతో గోవిందా హీరోగా పరిచయమయ్యాడు. అందులో తన జోడిగా నటించిన నీలమ్‌తో అప్పట్నుంచే ప్రేమించడం మొదలుపెట్టాడు. ఆమె స్వచ్ఛమైన మనసు, ఆమె ఛార్మింగ్ ఆయనను అమితంగా ఆకర్షించాయి. స్టార్‌డస్ట్ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఓ పాత ఇంటర్వ్యూలో నీలమ్‌పై తనకున్న ప్రేమను వివరంగా చెప్పుకొచ్చాడు గోవిందా. అయితే ఆమెపై తనకున్నది లస్ట్ కాదనీ, ప్యూర్ లవ్ అనీ ఆయన స్పష్టం చేశాడు.
స్క్రీన్‌పై తమ కెమిస్ట్రీతో ఆడియెన్స్‌ను అలరించిన గోవిందా, నీలమ్.. నిజ జీవితంలో భిన్న ధ్రువాల లాంటివాళ్లు. ఆమె హాంకాంగ్ నుంచి వచ్చిన నటి అయితే, గోవిందా ఫక్తు దేశీ. నిజానికి తన స్నేహితురాఆలు సునీతతో సీరియస్ రిలేషన్‌షిప్‌లోకి వెళ్లాలని ఆయన అనుకోలేదు. ఆయన దృష్టంతా నీలమ్ మీదే ఉండేది. అందుకే సునీతను కూడా నీలమ్ లాగా తయారవ్వమని చెప్పేవాడు. ఇది ఆమెకు కోపం తెప్పించింది కూడా. అప్పటికే సునీతను పెళ్లి చేసుకుంటానని మాటివ్వడంతో తనలో తనే మధనపడుతూ వచ్చాడు గోవిందా. ఆమె ముందు నీలమ్‌పై తన అనురాగాన్ని వ్యక్తం చేసేవాడు కూడా. ఈ విషయంలో ఆ ఇద్దరి మధ్యా పోట్లాటలు కూడా జరిగాయి. ఒకానొక సమయంలో ఆమెతో ఎంగేజ్‌మెంట్‌ను రద్దు చేసుకున్నాడు. ఐదు రోజుల తర్వాత సునీత తనను పిలవకపోయి ఉన్నట్లయితే, నీలమ్‌ను తాను పెళ్లాడి ఉండేవాడినేమోనని ఆయన చెప్పాడు.
జీవిత భాగస్వామిగా ఏ మగాడైనా కోరుకునే ఐడియల్ గాళ్ నీలమ్ అనీ, అందుకే ఆమెను పెళ్లి చేసుకోవాలనుకున్నాననీ గోవిందా తెలిపాడు. ఆఖరుకి గోవిందా తండ్రి కూడా నీలమ్ తన కోడలు కావాలని కోరుకున్నారు కానీ, తల్లి మాత్రం సునీతకు ఇచ్చిన మాటపై నిలబడమని కొడుక్కు గట్టిగా చెప్పారు. అలా నీలమ్‌తో గోవిందాది ఒన సైడెడ్ లవ్‌గా మిగిలింది. సునీతను పెళ్లాడక కూడా, నీలమ్ మీద తన ప్రేమను ఆయన దాచుకోలేదు. అయితే నీలమ్‌తో తన అనుబంధాన్ని ఎఫైర్ అని సంబోధిస్తే గోవిందాకు కోపం వస్తుంది. ఆమెపై తనకున్నది స్వచ్ఛమైన ప్రేమ అని ఆయన తెలిపాడు.
1987లోనే గోవిందా పెళ్లాడినప్పటికీ, నీలమ్ చాలా కాలానికి గానీ వివాహం చేసుకోలేదు. యు.కె.కు చెందిన బిజినెస్‌మ్యాన్ రిషి సేథియాను 2000 సంవత్సరంలో బ్యాంకాక్‌లో ఆమె పెళ్లాడారు. అయితే వారి వైవాహిక జీవితం ఎక్కువ కాలం కొనసాగలేదు. ఇద్దరూ డైవోర్స్ తీసుకున్నారు. తర్వాత నటుడు, దర్శకుడు సమీర్ సోనిని ఆమె 2011లో పెళ్లి చేసుకున్నారు.
Also Read