రేణు దేశాయ్ సినిమాలో గోరటి వెంకన్న పాట!
on Sep 14, 2020
రైతు సమస్యల నేపథ్యంలో ఓ చిత్రాన్ని తెరకెక్కించనున్నట్లు నటి, దర్శకురాలు రేణు దేశాయ్ గతంలో ప్రకటించారు. ఆ తరువాత చాలా రోజులు ఆ సినిమాకు సంబంధించిన కబురు ఏదీ చెప్పలేదు. దాంతో సినిమాను పక్కన పెట్టేశారేమో అని కొందరు సందేహించారు. అయితే ఆ సినిమా త్వరలో పట్టాలు ఎక్కనుంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి సంగీత చర్చలు జరుగుతున్నాయి. పాటలు రాయించుకునే పనిలో రేణుదేశాయ్ బిజీబిజీగా ఉన్నారు.
రేణు దేశాయ్ రైతు సినిమాలో ప్రముఖ ప్రజాకవి గోరటి వెంకన్న ఒక పాట రాస్తున్నారు. ఈ పాటకు సంబంధించిన చర్చల కోసం ఆయన వ్యవసాయ క్షేత్రానికి రేణు వెళ్లారు. అక్కడ ప్రకృతిని చూసి ఆమె పరవశించిపోయారు. ముఖ్యంగా గోరటి వెంకన్న సతీమణి మట్టిపాత్రలో వండిన పప్పు, రోటి పచ్చడి నచ్చాయని, అరిటాకులో భోజనం చేశాను అని చెప్పుకొచ్చారు. చిన్న వ్యవసాయ క్షేత్రంలో సాధారణ జీవితం గడుపుతున్నప్పటికీ గోరటి వెంకన్న దంపతుల మనస్సు చాలా పెద్దదని రేణుదేశాయ్ ప్రశంసించారు.
Also Read