గోపీచంద్, తేజ రెడీ...
on Jul 2, 2020
కరోనా కేసులు ప్రతిరోజూ పెరుగుతున్న నేపథ్యంలో స్టార్ హీరోలు షూటింగ్స్ స్టార్ట్ చేయడానికి మీనమేషాలు లెక్కిస్తున్నారు. మెగాస్టార్ రెండో అల్లుడు కళ్యాణ్ దేవ్ తప్ప మిగతా ఎవరూ షూటింగ్స్ స్టార్ట్ చేయలేదు. ఈ సమయంలో గోపీచంద్ ముందుకు రావడం డేరింగ్ స్టెప్ అనుకోవాలి. 'ఆర్ఆర్ఆర్' షూటింగ్ స్టార్ట్ చేయడానికి రెండుసార్లు రెడీ అయిన రాజమౌళి, మళ్ళీ క్యాన్సిల్ చేసిన నేపథ్యంలో తేజ షూటింగ్ చేయడానికి రెడీగా ఉన్నారు.
గోపీచంద్ హీరోగా తేజ దర్శకత్వంలో రూపొందనున్న సినిమా 'అలిమేలుమంగ వెంకటరమణ'. ఆగస్టు నుండి షూటింగ్ స్టార్ట్ చేయడానికి హీరో, డైరెక్టర్ రెడీ అవుతున్నారని సమాచారం. గవర్నమెంట్ గైడ్‌లైన్స్ ప్రకారం 50 మెంబర్స్ క్రూతో షూటింగ్ చేయడానికి తేజ ప్లాన్ రెడీ చేశారట. ఈ సినిమా షూటింగ్ సక్సెస్‌ఫుల్‌గా జరిగితే మిగతావాళ్లకు ఎగ్జాంపుల్‌గా ఉంటుంది. షూటింగ్ స్టార్ట్ చేయడానికి ముందు హీరోయిన్ను ఫైనలైజ్ చేయాలని అనుకుంటున్నారు. కాజల్ అగర్వాల్, నయనతార, అనుష్క పేర్లు హీరోయిన్ రేసులో ఉన్నాయి.