రజనీకాంత్ గారిని "కబాలి"గానే చూడాలని ఉంది: నాని
on Jun 26, 2016
జె.ఆర్.సిలో జరుగుతున్న "కబాలి" ఆడియో వేడుకకు అతిధిగా విచ్చేసిన యువ కథానాయకుడు నాని "కబాలి" తెలుగు టీజర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ.. "స్వతహా నేను శంకర్ గారి వీరాభిమానిని, కానీ నేను "రోబో 2.0" కంటే "కబాలి" సినిమా కోసం ఎక్కువగా ఎదురుచూస్తున్నాను. రజనీకాంత్ గారిని "రోబో"లా చూడడం కంటే.. ఆయన్ను "రజనీ"లా చూడడమే ఎక్కువగా ఇష్టపడతాను. ఆయన్ని "కబాలి"లో చూస్తుంటే సినిమా ఎప్పుడెప్పుడు చూస్తామా? అని చాలా ఆత్రంగా ఉంది" అన్నారు.
Also Read