English | Telugu

`అర్జున్ రెడ్డి`కి అత‌డే క‌రెక్టా???

on Feb 12, 2019

`అర్జున్ రెడ్డి` చిత్రంతో సెన్సేష‌న‌ల్ హీరోగా మారాడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌. సందీప్ వంగా ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ఈ సినిమాను ప‌లు భాష‌ల్లో రీమేక్ చేస్తున్నారు. అందులో భాగంగానే త‌మిళ్ లో కూడా రీమేక్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇందులో త‌మిళ స్టార్ హీరో విక్ర‌మ్ త‌న‌యుడు ధృవ్ హీరో.  మొద‌ట బాల ద‌ర్శ‌క‌త్వంలో  ఈ చిత్రాన్ని ప్రారంభించారు. ఇటీవ‌ల అవుట్ పుట్ చూసిన నిర్మాత‌లు సంతృప్తి చెంద‌ర‌క సినిమాను మ‌ళ్లీ రీ షూట్ చేయాల‌ని నిర్ణ‌యించుకున్నారు. ఈ విష‌యాన్ని ఇటీవ‌ల నిర్మాత‌లు అధికారికంగా ప్ర‌క‌టించారు. అయితే ఈ సినిమాలో ఒక్క ధృవ్ ని మిన‌హా మిగ‌తా వాళ్లంద‌రినీ  కొత్త‌వాళ్ల‌ను తీసుకోవాల‌ని నిర్ణ‌యించుకున్నారు నిర్మాత‌లు. ఇక ఈ విష‌యం పై ద‌ర్శ‌కుడు బాల స్పందిస్తూ క్రియేటివిటీలో విభేదాల కార‌ణంగానే త‌ప్పుకున్నాన‌నీ క్లారిటీ ఇచ్చాడు.  ఇదిలా ఉంటే ఈ సినిమా పై ప్ర‌స్తుతం ఆస‌క్తిక‌ర‌మైన వార్తలు చ‌క్క‌ర్లు కొడుతున్నాయి.  అందులో మొద‌టిది ఈ సినిమా కోసం గౌత‌మ్ మీన‌న్ ద‌ర్శ‌కుడుగా తీసుకోనున్నార‌ట‌. ఇప్ప‌టికే విక్ర‌మ్ గౌత‌మ్ మీన‌న్ తో చ‌ర్చ‌లు కూడా జ‌రిపిన‌ట్లు , అత‌డు కూడా సుముఖంగా ఉన్న‌ట్లు తెలుస్తోంది.  ల‌వ్ అండ్  రొమాంటిక్ చిత్రాల‌ను స్టైలిష్ గా ప్ర‌జంట్ చేయ‌డంలో దిట్టైన గౌత‌మ్ మీన‌న్ అయితే అర్జున్ రెడ్డి రీమేక్ కు క‌రక్ట్ అని నిర్మాత‌లు కూడా భావిస్తున్నార‌ట‌.  ఇక ఈ సినిమా కు సంబంధించి మ‌రో వార్త హ‌ల్ చ‌ల్ చేస్తోంది. అదేమిటంటే...గ‌తంలో శ్రీదేవి త‌న‌యురాలు జాన్వి క‌పూర్ విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో న‌టించాలని ఉందంటూ ఒక టీవీ షోలో చెప్పుకొచ్చింది. అయితే విజ‌య్ దేవ‌రకొండ‌తో కాదు కానీ , త‌న‌కు ఎంతో క్రేజ్ తెచ్చిన అర్జున్ రెడ్డి త‌మిళ్ రీమేక్ లో జాన్వీ క‌పూర్ ని హీరోయిన్ గా తీసుకోవాలన్న ఆలోచ‌న‌లో నిర్మాత‌లు ఉన్నార‌ట‌. మ‌రి ఇందులో ఎంత వ‌ర‌కు నిజ‌ముందో తెలియాలంటే అధికారిక ప్ర‌క‌ట‌న వ‌చ్చే వ‌ర‌కు ఆగాల్సిందే.


Also Read



Latest News



Customer Service

Live Help 24/7Customer Care

teluguone.teluguone@gmail.com

Send your Queries to

support@teluguone.com

Follow Us Here