బాలయ్యకు 5 గంటలు.. చిరంజీవికి 4 గంటలు...
on Jan 8, 2017
ఈ మధ్య సినిమాలపై సోషల్ మీడియా ఎఫెక్ట్ కూడా బాగానే పడుతుంది. ఎన్ని వ్యూవ్స్ వచ్చాయి.. ఎన్ని షేర్లు.. ఎన్ని లైక్స్ ఈ కౌంటింగ్ ఎక్కువైపోయింది. ఏ సినిమా ఎన్ని ఎక్కువ వ్యూవ్స్ కొడితే అంత గ్రేట్. ప్రస్తుతం ఈ కౌంటింగ్ రెండు సినిమాల మధ్య పోరుగా మారింది. ఆ సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒకటి మెగాస్టార్ చిరంజీవి నటించిన 'ఖైదీ నంబర్ 150' సినిమా కాగా.. రెండోది, బాలకృష్ణ నటించిన 'గౌతమీపుత్ర శాతకర్ణి' చిత్రం. అయితే ఇప్పుడు 'గౌతమీపుత్ర శాతకర్ణి' చిత్రం నెలకొల్పిన టాలీవుడ్ రికార్డును చిరంజీవి 'ఖైదీ నంబర్ 150' బ్రేక్ చేసింది. శాతకర్ణి చిత్రం ట్రైలర్ ను విడుదల చేసిన తరువాత వన్ మిలియన్ (పది లక్షలు) హిట్స్ రావడానికి 5 గంటల సమయం పట్టగా, ఖైదీ ట్రైలర్ 3 గంటలా 40 నిమిషాల్లోనే పది లక్షల హిట్స్ సాధించింది. తెలుగు చిత్ర పరిశ్రమకు సంబంధించినంత వరకూ ఓ ట్రైలర్ ఇంతగా హిట్ కావడం ఇదే తొలిసారి. దీంతో ఇప్పుడు ఈ టైమింగ్ ను కూడా కౌంట్ చేశారు అభిమానులు.