క్రిష్‌ను అవమానించిన హేమమాలిని
on Jan 10, 2017
నందమూరి బాలకృష్ణ వంద చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాలో ఆయన తల్లి పాత్ర చాలా ప్రాధాన్యమున్న పాత్ర..చరిత్రలో తన పేరు ముందు ..తల్లి పేరును పెట్టి ఆమెను గౌరవించిన గొప్ప చక్రవర్తి గౌతమిపుత్ర శాతకర్ణి..అలాంటి తల్లి పాత్రకు ఎవరైతే న్యాయం చేయగలరా అని ఆలోచించిన డైరెక్టర్ క్రిష్ చాలా మందిని అనుకుని చివరకు బాలీవుడ్ డ్రీమ్‌గర్ల్ హేమమాలిని అయితే సరిగ్గా సెట్ అవుతారని భావించారట. ఆమెను కలుద్దామని వెళితే కనీసం అప్పాయింట్ మెంట్ కూడా ఇవ్వలేదట..ఈ విషయం స్వయంగా క్రిష్ చెప్పారు. చాలా రోజులు తిప్పలు పడి..ఎలాగో పర్మిషన్ తీసుకుని ఈ కథ చెప్పా..కథ వినగానే హేమ వెంటనే అంగీకరించారు. సినిమాలో ఆమెది చాలా పవర్ఫుల్ పాత్ర..షూటింగ్ తొలి రోజు హేమమాలిని సేకరించిన మెటీరియల్ చూసి ఆశ్చర్యపోయా..మంచి ఇన్వాల్వ్మెంట్ ఉన్న నటి అని డ్రీమ్గర్ల్ని ప్రశంసలతో ముంచెత్తారు.