`గ్యాంగ్ లీడర్ ` మరోసారి వాయిదా పడనుందా??
on Aug 24, 2019
`నానిస్ గ్యాంగ్ లీడర్ ` మూవీ మరోసారి వాయిదా పడే అవకాశాలు ఉన్నట్లు సమాచారం అందుతోంది. మొదట ఈ సినిమాను ఆగష్టు 30న రిలీజ్ చేయాలనుకున్నారు కానీ , అదే రోజు `సాహో ` సినిమా రిలీజ్ అవుతుండటం తో ఇక గ్యాంగ్ లీడర్ సినిమా సెప్టెంబర్ 13 కి వాయిదా వేశారు. అయితే రిలీజ్ డేట్ దగ్గర పడుతున్నా సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ ఇంకా ప్రారంభించాక పోవడం తో మరోసారి సినిమా వాయిదా పడనుందనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే రిలీజ్ అయిన పాటలు , టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమా పై మంచి బజ్ కూడా వచ్చింది. ఈ నేపథ్యం లో సినిమా కి సంబంధిచిన ప్రమోషన్స్ స్పీడ్ పెంచక పోవడం తో వాయిదా పడనుందన్నట్లు వార్తలు వస్తున్నాయి. మరి సోషల్ మీడియా లో వస్తోన్న ఈ న్యూస్ చూసి ఇక నైనా నిర్మాతలు త్వరగా స్పందించి క్లారిటీ ఇస్తే గాసిప్స్ కి ఫుల్ స్టాప్ పడే అవకాశాలుంటాయి. ఇక ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోండగా విక్రమ్ కే కుమార్ డైరెక్టర్ గా వ్యహరిస్తున్నాడు.
Also Read