English | Telugu

మా సినిమా వాళ్లు వేస్ట్..?

on Nov 13, 2017

మనదేశంలో సినీరంగం నుంచి వచ్చి రాజకీయాల్లో సంచలనం సృష్టించిన వారు ఎందరో ఉన్నారు. వారిని స్పూర్తిగా తీసుకొని నాటి నుంచి నేటి వరకు ఎంతోమంది పాలిటిక్స్‌లో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటూనే ఉన్నారు. తాజాగా తెలుగునాట పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ జనసేనను స్థాపించగా.. తమిళనాడులో రజనీ, కమల్ ఆ దిగా అడుగులు వేస్తున్నారు. ప్రస్తుతానికి వీరు పేర్లు మాత్రమే వినిపిస్తుండగా.. ఎన్నికల నాటికి ఈ లిస్ట్ భారీగానే ఉండబోతుందని అంచనా.. సరిగ్గా ఇలాంటి సమయంలో సినిమా వాళ్లు రాజకీయాలకు శుద్ధ వేస్ట్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు విలక్షణ నటుడు ప్రకాశ్‌రాజ్. సినీనటులకు కులమతాలకు అతీతంగా అభిమానులు ఉంటారని.. అలాంటి వారు రాజకీయాల్లోకి వస్తే.. కొన్ని వర్గాల ప్రజలు తమకు దూరమవుతారని అది దేశానికి ఏమాత్రం శ్రేయస్కరం కాదన్నారు. అందుకే సినీనటులు రాజకీయాల్లోకి ప్రవేశించడం.. పార్టీలను పెట్టడాన్ని తాను సమర్థించనని చెప్పారు. మరీ ఈయన మాటలను సదరు సినిమా వాళ్లు ఇంకా విన్నారో లేదో..?


Also ReadLatest NewsCustomer Service

Live Help 24/7Customer Care

teluguone.teluguone@gmail.com

Send your Queries to

support@teluguone.com

Follow Us Here